భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం

భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు చేశారు.

Published : 16 Apr 2024 05:50 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోక్తంగా రెండు రకాల చెట్ల చెక్కలతో నిప్పును పుట్టించి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపన చేయడంతో ఈ వేడుక నయనానంద భరితమైంది. గరుడపటాన్ని పూజించిన తర్వాత ధ్వజారోహణ క్రతువు వైభవంగా సాక్షాత్కరించింది. గరుడమూర్తికి ప్రసాదాన్ని ఆరగింపు చేసి భక్తులకు అందించారు. మంగళవారం ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. 

కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వండి: మంత్రి సురేఖ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని ఈ నెల 17వ తేదీన నిర్వహించే సీతారామ కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసార అంశాన్ని పునః సమీక్షించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం లేఖ రాశారు. కాగా ప్రత్యక్ష ప్రసారం అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నిరాకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని