డీఎంఈ పరిధిలోని.. 16,024 మంది సిబ్బంది సేవల పొడిగింపు

వైద్య విద్య డైరెక్టర్‌(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 20 Apr 2024 04:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య విద్య డైరెక్టర్‌(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంఈ పరిధిలోని వైద్య విభాగాల్లో 4,013 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, 9,684 అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 2,327 మంది సేవలను ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి కె.హరిత ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని