Published : 21 May 2021 23:06 IST

Viral: వేడుకలో తుపాకులతో బందిపోట్ల హల్‌చల్‌

భిండ్‌: మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో జరిగిన ఓ పుట్టినరోజు వేడుకలో తుపాకులు పట్టుకుని బందిపోటు ముఠాలు హల్‌చల్ చేశాయి. కొవిడ్  నిబంధనలు ఉల్లంఘిస్తూ.. గుంపులుగా ఏర్పడిన యువకులు తుపాకులు చూపిస్తూ నినాదాలు చేసిన దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. గోర్కి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పూరా కాచ్నవ్‌కు చెందిన రామ్ లక్ష్మణ్ తన కుమారుడి పుట్టినరోజు వేడుకలు బుధవారం నిర్వహించాడు. కాగా ఈ కార్యక్రమానికి చాలా మంది అతిథులు హాజరయ్యారు. గ్వాలియర్‌కు చెందిన గిరిరాజ్ పహిల్వాన్ అనే వ్యక్తి తన అనుచరగణంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. కాగా అతడి అనుచరులంతా తుపాకులతో హల్‌చల్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని రామ్‌ లక్ష్మణ్‌, గిరిరాజ్‌లపై కేసు నమోదు చేశారు.


Read latest Viral videos News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని