వీటిని గుర్తుపెట్టుకోండి!

టెక్నాలజీ, కార్పొరేట్‌ రంగాల్లో నాయకురాలిగా 15 ఏళ్ల అనుభవం అన్నపూర్ణ విశ్వనాథన్‌ సొంతం. ప్రస్తుతం వైస్‌ ప్రెసిడెంట్, హెడ్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఎయిర్‌బస్, ఇండియా-దక్షిణాసియా హోదాలో ఉన్నారు. మహిళలకు కెరియర్‌ నిర్మాణంపైన తన ఆలోచనల్ని చెబుతున్నారిలా... 

Eenadu icon
By Vasundhara Desk Published : 24 Sep 2025 02:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

టెక్నాలజీ, కార్పొరేట్‌ రంగాల్లో నాయకురాలిగా 15 ఏళ్ల అనుభవం అన్నపూర్ణ విశ్వనాథన్‌ సొంతం. ప్రస్తుతం వైస్‌ ప్రెసిడెంట్, హెడ్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఎయిర్‌బస్, ఇండియా-దక్షిణాసియా హోదాలో ఉన్నారు. మహిళలకు కెరియర్‌ నిర్మాణంపైన తన ఆలోచనల్ని చెబుతున్నారిలా... 

  • చేరుతున్న కంపెనీలో మహిళలు ఎంత శాతం ఉన్నారు, వాళ్లు కీలక స్థానాల్లో ఉన్నారా, ఉద్యోగినులకు ఉన్న సదుపాయాలేంటి... ఇవన్నీ పరిశీలించండి. సానుకూలంగా ఉంటేనే చేరండి. 
  • నాకప్పుడు పాతికేళ్లు. ఒక డేటా సెంటర్‌ నిర్వహణ బృందానికి లీడ్‌గా వెళ్లాను. టీమ్‌లో నేను తప్ప మిగతా 40 మంది మగవాళ్లే. ‘ఏం చేయగలదో చూద్దాం’ అన్నట్టుండేది వాళ్ల వైఖరి. నా ప్రత్యేకతను చేతల్లోనే చూపా. రెండు మూడు అనుభవాల తర్వాత వాళ్లే దారికి వచ్చారు. 
  • పిల్లల తర్వాత కెరియర్‌ను కొనసాగించడం 2.0 లాంటి దశ. ‘కొత్త బాధ్యతలు అప్పగిస్తే, సమయం కేటాయించగలరా’ లాంటి ప్రశ్నలు వస్తాయి. పరిమితులు చెబుతూనే, మీ సామర్థ్యంతో ఆ పనిని ఎలా పూర్తిచేయగలరో వివరించండి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. 
  • శుక్రవారమే వచ్చే వారానికి ప్రణాళిక వేసుకుంటా. వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలకు తగిన ప్రాధాన్యం ఇస్తా. మావారితో, అబ్బాయితో తగిన సమయం గడిపేలా చూసుకుంటా. వ్యాయామానికి సమయం కేటాయిస్తా. సామాజిక బంధాలూ ముఖ్యమే, వాటికీ చోటిస్తా. 
  • మన సంస్కృతిలో డబ్బుకంటే పని ముఖ్యం అనుకుంటాం. ఆర్థిక అంశమూ ముఖ్యమని క్రమంగా అర్థమైంది. అప్పట్నుంచి నా విలువకంటే, తక్కువ మొత్తానికి అంగీకరించకూడదనుకున్నా. పొందే మొత్తాన్నిబట్టి మీ విలువని లెక్కించే వాళ్లూ ఉంటారు. వేతనం విషయాన్ని హెచ్‌ఆర్‌తో ధైర్యంగా మాట్లాడగలగాలి. అమ్మాయిలు ప్రణాళికలు వేసి పొదుపు, మదుపు చేసి ఆర్థిక లక్ష్యాలు అందుకోవాలి.
  • పిల్లలూ, ఇంటి నిర్వహణలో 100 శాతం బాధ్యత తీసుకుంటే కెరియర్‌లో రాణించడం కష్టం. జీవిత భాగస్వామికీ, కుటుంబ సభ్యులకీ బాధ్యతలు పంచండి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్