ఆరోగ్యానికెంతో మంచిది.. ఈ మువ్వన్నెల అవియల్!

పండగలు, శుభకార్యాలు వంటి సందర్భాలలో మలయాళీలు అవియల్ తప్పనిసరిగా చేసుకుంటారు..! మరి దేశమంతా పండగలా జరుపుకొనే గణతంత్ర దినోత్సవం....

Published : 27 Jan 2023 21:03 IST

పండగలు, శుభకార్యాలు వంటి సందర్భాలలో మలయాళీలు అవియల్ తప్పనిసరిగా చేసుకుంటారు..! మరి దేశమంతా పండగలా జరుపుకొనే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన మువ్వన్నెల జెండాను తలపించే ట్రై కలర్ అవియల్ ట్రై చేద్దామా..!

కావలసిన పదార్థాలు..

ఆకుపచ్చ రంగు కోసం

మునక్కాడలు : రెండు

బీన్స్ : పది

పచ్చి బఠాణీ : ఒక కప్పు

ఆకుపచ్చ క్యాప్సికం : ఒకటి

తెలుపు రంగు కోసం

అరటి కాయ : ఒకటి

ఆలూ : రెండు

ముల్లంగి : ఒకటి

సొరకాయ : చిన్న ముక్క

కాషాయ రంగు కోసం

గుమ్మడి కాయ : పావు ముక్క

క్యారట్ : నాలుగు

పచ్చి కొబ్బరి : ఒక కొబ్బరికాయ పూర్తిగా

పచ్చి మిరపకాయలు : ఐదు

జీలకర్ర : ఒక స్పూను

కొబ్బరి నూనె: ఆరు టీ స్పూన్లు

ఆవాలు : తాలింపుకి సరిపడా

కరివేపాకు : తాలింపుకి సరిపడా

పసుపు : చిటికెడు

ఎండు మిరపకాయలు : రెండు

ఇంగువ : చిటికెడు

పెరుగు : మూడు టేబుల్ స్పూన్లు

తయారీ...

మునక్కాడలు, బీన్స్, బఠాణీ, క్యాప్సికం పొడుగు ముక్కలుగా కట్ చేసుకుని, కాస్త పసుపు వేసి ఒక పాత్రలో ఉంచాలి. అలాగే చెక్కు తీసిన అరటి కాయ, ఆలూ, ముల్లంగి, సొరకాయ పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని మరొక పాత్రలో ఉంచాలి. గుమ్మడి కాయ, క్యారట్‌లను పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని, కొద్దిగా పసుపు చేర్చి ఇంకొక పాత్రలో ఉంచాలి. ఇప్పుడు ఈ మూడింటినీ తక్కువ నీళ్లు పోసి విడి విడిగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోగా... పచ్చి కొబ్బరి, పచ్చి మిరప కాయలు, జీలకర్ర బరకగా మిక్సీ పట్టుకోవాలి. విడివిడిగా ఉడికించుకున్న కూరగాయ ముక్కలలో ఈ మిశ్రమాన్ని అన్ని పాత్రలలో సమానంగా కలుపుకోవాలి. ప్రతి పాత్రలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలపాలి. చివరగా కొబ్బరి నూనె వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసి తాలింపు వేసుకోవాలి.

ఇప్పుడీ మూడు రంగుల అవియల్‌ని జెండా రంగుల్లా సర్వింగ్ బౌల్‌లో డెకరేట్ చేసుకుంటే ట్రై కలర్ అవియల్ రడీ...!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్