Baby Gadgets: పాపాయి జారిపోకుండా..!

నెలల పిల్లల్ని ఎత్తుకోవడమే కష్టమనుకుంటే.. వారికి స్నానం చేయించడం తల్లులకు పెద్ద సవాలు! ఎందుకంటే ఒంటికి సబ్బు, షాంపూ రుద్దే క్రమంలో వారు చేతుల్లోంచి ఎక్కడ జారిపోతారోనని భయపడుతుంటారు. అలాగని టబ్‌ బాత్‌ చేయిద్దామా.....

Published : 23 Jun 2023 23:36 IST

నెలల పిల్లల్ని ఎత్తుకోవడమే కష్టమనుకుంటే.. వారికి స్నానం చేయించడం తల్లులకు పెద్ద సవాలు! ఎందుకంటే ఒంటికి సబ్బు, షాంపూ రుద్దే క్రమంలో వారు చేతుల్లోంచి ఎక్కడ జారిపోతారోనని భయపడుతుంటారు. అలాగని టబ్‌ బాత్‌ చేయిద్దామా అంటే.. అందులోనూ కుదురుగా కూర్చుంటారో, లేదోనన్న భయం. ఈ సమస్యను తీర్చేందుకే ‘బేబీ బాత్‌ టబ్‌ సీట్‌ చెయిర్స్‌’ ప్రస్తుతం అందుబాటులోకొచ్చాయి.

చెయిర్‌ మాదిరిగా, స్విమ్మింగ్‌ పూల్‌ ట్యూబ్‌ తరహాలో, కంఫర్టబుల్‌గా కూర్చొని స్నానం చేసే కుర్చీ లాంటివి, నెట్టెడ్‌ తరహాలో రూపొందించినవి, వివిధ రకాల బొమ్మల ఆకృతుల్లో రూపొందించినవి.. ఇలా చాలా డిజైన్లలో ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిని ఆయా సూచనల ప్రకారం బాత్‌ టబ్‌లో అమర్చితే.. సురక్షితంగా పాపాయికి స్నానం చేయించచ్చు. అంతేకాదు.. ఈ సీట్స్‌పై పడుకున్నా, కూర్చున్నా బేబీ జారకుండా ఉండేందుకు.. యాంటీ స్లిప్‌ షీట్‌ ఒకటి దాని ఉపరితలంపై ఫిక్స్‌ చేసి ఉంటుంది. చిన్నారిని ఇందులో కూర్చోబెట్టి.. తను నీటితో ఆడుకుంటుంటే.. మీరు గబగబా స్నానం చేయించేయచ్చు. స్నానం అంటే ఏడ్చే పిల్లలకు ఈ గ్యాడ్జెట్‌ మరింత ఉపయుక్తం. ఇక పాపాయి స్నానం పూర్తయ్యాక ఈ చెయిర్‌ని శుభ్రంగా కడిగి ఆరుబయట ఆరబెడితే.. మరునాడు తిరిగి ఉపయోగించుకోవచ్చు. అలాంటి బేబీ ఫ్రెండ్లీ బాత్‌ చెయిర్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్