చిన్న బెల్లం ముక్కతో.. ప్రయోజనాలెన్నో!

కడుపులో మంట, ఎసిడిటీ లాంటి సమస్యలను అధిగమించడానికి ఒక చిన్న బెల్లం ముక్క తింటే చాలు. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరంలో ఉష్ణోగ్రత పెరగకుండా కాపాడడంలో బెల్లం ముఖ్య పాత్ర పోషిస్తుంది....

Published : 30 Mar 2024 18:59 IST

కడుపులో మంట, ఎసిడిటీ లాంటి సమస్యలను అధిగమించడానికి ఒక చిన్న బెల్లం ముక్క తింటే చాలు. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరంలో ఉష్ణోగ్రత పెరగకుండా కాపాడడంలో బెల్లం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఒక్కటే కాదు.. బెల్లం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

 కొంతమంది అమ్మాయిలు నెలసరి సమయంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారు కొన్ని కాకరకాయ ఆకులు, ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న బెల్లం ముక్క.. ఈ మూడింటినీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు ఒక వారం రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 పొడి దగ్గు, జలుబు, ఆస్తమా.. లాంటి సమస్యల నివారణ కోసం తయారు చేసే ఆయుర్వేద మందుల్లో బెల్లాన్ని ఉపయోగిస్తారు.

 తరచుగా పొడి దగ్గు బాధిస్తున్నట్లయితే ఒక గ్లాసు బెల్లం పానకంలో కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరగనిచ్చి చల్లారనివ్వాలి. ఈ నీటిని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 బెల్లంలో ఉండే మెగ్నీషియం వల్ల రక్తనాళాలు, నాడీవ్యవస్థ పటిష్టమవుతాయి.
 మైగ్రెయిన్ తలనొప్పి బాధిస్తుంటే బెల్లం, నెయ్యి.. ఈ రెండిటినీ సమపాళ్లలో కలిపి తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

 శరీరంలో ఎక్కడైనా బాగా నొప్పిగా అనిపించినట్లయితే.. నెయ్యిలో వేసిన బెల్లం ముక్కను నొప్పి ఉన్న చోట ఉంచితే ఉపశమనం లభిస్తుంది.
 కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందడంలోనూ బెల్లం చక్కగా పని చేస్తుంది. అందుకోసం.. రోజూ అల్లం, బెల్లం.. రెండూ సమపాళ్లలో కలిపి తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 అల్లాన్ని ఎండబెట్టాక పొడి చేసి, దాంట్లో కాస్త బెల్లాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు వెంటనే తగ్గుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్