చాక్‌పీస్‌ని ఇలా కూడా..!

చిన్న చిన్న వస్తువులే ఒక్కోసారి పెద్ద సమస్యలు తీరుస్తాయి. అలాంటిదే చాక్‌పీస్కూడా..! కేవలం బోర్డు మీద రాయడానికో, ముగ్గులు వేయడానికో కాకుండా దీన్ని చాలా రకాలుగా వాడొచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే....

Published : 28 Nov 2022 21:05 IST

చిన్న చిన్న వస్తువులే ఒక్కోసారి పెద్ద సమస్యలు తీరుస్తాయి. అలాంటిదే చాక్‌పీస్కూడా..! కేవలం బోర్డు మీద రాయడానికో, ముగ్గులు వేయడానికో కాకుండా దీన్ని చాలా రకాలుగా వాడొచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఇది చదవండి.

⚛ దుస్తుల మీద, లెదర్ వస్తువుల మీద నూనె మరకలు పడ్డప్పుడు చాక్‌పీస్‌తో రుద్ది, ఒక పది నిముషాల తర్వాత దులిపేయాలి. చాక్‌పీస్ నూనెను పూర్తిగా పీల్చుకుని మరకని మాయం చేస్తుంది.

⚛ వెండి, రాగి, ఇత్తడి వస్తువులు నల్లబడుతున్నాయా? అయితే వాటిని తిరిగి మెరిపించాలంటే చాక్‌పీస్ పొడితో శుభ్రపరిస్తే సరి..!

⚛ చాక్‌పీస్ పొడిని గుడ్డలో కట్టి తడిగా ఉన్న లేదా చెమట వాసన ఉన్న షూలలో రెండు గంటలపాటు (రాత్రంతా ఉంచితే మరీ మంచిది) ఉంచాలి. ఇలా చేస్తే తడి, వాసన పోయి షూలు శుభ్రంగా ఉంటాయి.

⚛ పెన్నుతో రాసేటప్పుడు తప్పు దొర్లిందా.. అందుబాటులో వైట్‌నర్ లేకపోతే కంగారు పడకండి. చాక్‌పీస్ను వైట్‌నర్‌గా ఉపయోగించి చూడండి. సమస్య ఇట్టే పరిష్కారమౌతుంది.

⚛ అతి ముఖ్యమైన పేపరు మీద నీళ్లు ఒలికిపోయాయా..? ఫర్వాలేదు.. ఆ తడి మీద చాక్‌పీసును దొర్లించండి. నీరంతా మాయమౌతుంది.

⚛ తాళపు చెవి తరచూ తాళంలో ఇరుక్కు పోతుంటే ఆ తాళానికీ తాళపు చెవికీ చాక్‌పీస్ను రుద్దండి. సమస్య పరిష్కారమౌతుంది.

⚛ చీమలు పోవాలంటే ఇలా చేయండి. చాక్‌పీసుని కాస్త గ్యాసోలిన్ నూనెలో తడపాలి. లేదంటే దానిపై నాలుగు లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలు వేయాలి. ఆ చాక్‌పీస్ను గోడ వెంబడి గీస్తే ఇక చీమలు ఆ ప్రదేశానికి రావు.

⚛ తెల్లని గోడలపై పగుళ్లను, మేకులు కొట్టిన మరకలను, చాక్‌పీస్తో రుద్ది కవర్ చేయొచ్చు.

⚛ పాత దుస్తులు, దుప్పట్లు పెట్టే ప్రదేశంలో చాక్‌పీస్లని ఒక పల్చని గుడ్డలో కట్టి ఉంచితే ముతక వాసన రాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్