Updated : 21/11/2022 15:09 IST

పిల్లల గురించి డాక్టర్‌ని ఈ విషయాలు అడుగుతున్నారా?

పిల్లల పెంపకంలో మొదటి అయిదు సంవత్సరాలు ఎంతో కీలకం. ఈ సమయంలోనే వారిలో అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అందుకే అయిదేళ్లొచ్చేదాకా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటారు పెద్దవాళ్లు. ఈ సమయంలో వారిలో జరిగే ప్రతి మార్పును గమనిస్తూ ఉండాలి. ఏదైనా సందేహం వస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఈ క్రమంలో డాక్టర్‌ వద్దకు వెళ్లినప్పుడు పిల్లల గురించి ఏ విషయాలు అడగాలో తెలుసుకుందామా...

ఏడాది లోపు..

✬ చిన్నారికి పాలు ఎంతసేపు పట్టాలి? పాలు ఇచ్చేటప్పుడు గ్యాప్‌ ఎంత ఉండాలి?ఈ విషయంలో ఏవైనా నియమాలు పాటించాలా?

✬ బేబీ సరిపడినంత సేపు నిద్రపోతోందని తెలుసుకోవడం ఎలా?

✬ డైపర్లను వాడచ్చా? ఒకవేళ వాటిని ఉపయోగిస్తే ఎన్ని గంటలకోసారి మార్చాలి?

✬ పాపాయికి విటమిన్‌ డి సరిపడినంత అందుతోందని ఎలా తెలుసుకోవాలి?ఇందుకోసం సప్లిమెంట్లను ఉపయోగించచ్చా?

✬ బేబీకి స్నానం చేయించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

✬ చిన్నారి అదేపనిగా ఏడుస్తుంటే ప్యాసిఫయర్లు వాడచ్చా?

✬ వయసుని బట్టి ఏయే వ్యాక్సిన్లు వేయించాలి?

✬ పాప ఎత్తు, బరువు, ఎదుగుదల సాధారణంగానే ఉందా?

✬ సిరప్‌లు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

✬ ఎన్నిరోజులకు ఒకసారి డాక్టర్ చెకప్ అవసరమవుతుంది?

1-4 ఏళ్ల లోపు వారికి..

✬ పాప/బాబు ఎదుగుదల సాధారణంగానే ఉందా?

✬ పాటీ ట్రైనింగ్‌ ఇవ్వడానికి ప్రత్యేక పద్ధతులు ఏవైనా ఉన్నాయా? ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

✬ సాధారణంగా పిల్లలకు మాటలు ఎప్పుడు వస్తుంటాయి? ఈ విషయంలో గమనించాల్సిన అంశాలేమిటి?

✬ వయసుకు తగ్గ బరువు ఉందా?

✬ ఈ సమయంలో వారిలో వచ్చే కీలక మార్పులు ఏంటి? అవి సాధారణంగానే ఉన్నాయని తెలుసుకోవడం ఎలా?

✬ ఇప్పటినుంచే వారికి క్రమశిక్షణ అలవాటు చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

✬ ఒకవేళ పాప/బాబుకి ఆటిజం వంటి సమస్యలు ఉంటే తెలుసుకోవడం ఎలా? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి?

వీటితో పాటు ఇతర సందేహాలు ఏవైనా ఉంటే వాటిని పేపర్‌పై రాసుకోవడం మంచిది. తద్వారా డాక్టర్‌ వద్దకు వెళ్లినప్పుడు మర్చిపోయే అవకాశం ఉండదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని