Winter Gadgets: చంటి పిల్లలకు జలుబు చేస్తే..!

అసలే చలికాలం.. ఈ శీతల వాతావరణానికి పెద్దలే తట్టుకోలేరు.. ఇక పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ కాలంలో పదే పదే జలుబు, దగ్గు, జ్వరం.. వంటి అనారోగ్యాలు వారిని వేధిస్తుంటాయి. అందులోనూ జలుబైతే ఓ పట్టాన తగ్గదు.. సరికదా ఎంత శుభ్రం చేసినా ముక్కు కారడం, పదే పదే తుడిస్తే ఆ భాగం....

Published : 06 Nov 2022 13:14 IST

అసలే చలికాలం.. ఈ శీతల వాతావరణానికి పెద్దలే తట్టుకోలేరు.. ఇక పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ కాలంలో పదే పదే జలుబు, దగ్గు, జ్వరం.. వంటి అనారోగ్యాలు వారిని వేధిస్తుంటాయి. అందులోనూ జలుబైతే ఓ పట్టాన తగ్గదు.. సరికదా ఎంత శుభ్రం చేసినా ముక్కు కారడం, పదే పదే తుడిస్తే ఆ భాగం ఎర్రగా మారడం.. వంటివి జరుగుతాయి. అలాగని చంటి పిల్లలు ముక్కు చీదలేరు. కాబట్టే ఇలాంటి బుజ్జాయిల కోసం ప్రస్తుతం ‘మ్యూకస్‌ సకర్స్‌’ (Mucus Sucker) అందుబాటులోకి తీసుకొచ్చారు డిజైనర్లు.

నాజిల్‌ డ్రాపర్‌లా, పిల్లలు తాగే పాల డబ్బాలా, ఫేస్‌ మసాజర్‌లా.. ఇలా విభిన్న డిజైన్లలో రూపొందించిన మ్యూకస్‌ సకర్స్‌ ప్రస్తుతం అందుబాటు ధరల్లోనే మార్కెట్లో లభ్యమవుతున్నాయి. దీన్ని ముందుగా నొక్కి.. ఆపై ముక్కు వద్ద ఉంచి వదిలితే.. ముక్కులో నుంచి కారే ద్రవపదార్థాన్ని లాగేసుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. అచ్చం దీన్ని పిల్లలకు మందులు వేసే డ్రాపర్‌లా ఉపయోగించాలన్నమాట! అలా కొన్నిసార్లు వాడిన తర్వాత భాగాలన్నీ విడదీసి వేడి నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. ఇవన్నీ సిలికాన్‌తోనే తయారవుతాయి కాబట్టి వేడి నీళ్లతో కడిగినా నాణ్యత తగ్గిపోదు.. పైగా క్రిములు, బ్యాక్టీరియా.. వంటివి కూడా సులభంగా నశిస్తాయి. ఆపై ఆరబెట్టుకొని తిరిగి ఉపయోగిస్తే సరిపోతుంది. అలాంటి కొన్ని వెరైటీ మ్యూకస్‌ సకర్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్