ఆ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలకు ఏమైనా సమస్య వస్తుందా?

నమస్తే మేడమ్‌. నాకు గత ఆరు నెలలుగా యూరిన్‌ చాలా నెమ్మదిగా వస్తోంది. మధ్యలో ఆగిపోతుంది.. మధ్యమధ్యలో లీకవుతూ అలా చాలాసేపు పడుతుంది. డాక్టర్‌ని సంప్రదిస్తే స్కానింగ్‌ తీసి బ్లాడర్‌ ఖాళీ కావట్లేదన్నారు. మూత్రవిసర్జన చేసే నాళం సన్నగా అయింది.. సిస్టోస్కోపీ చేయాలన్నారు. ఈ సమస్య తగ్గడానికి ఏమైనా మందులుంటే సలహా ఇవ్వగలరు. ఇలా బ్లాడర్‌ ఖాళీ కాకపోతే ఇన్ఫెక్షన్‌ వల్ల కిడ్నీలకు ఏమైనా సమస్య వస్తుందా? దయచేసి చెప్పండి.

Updated : 29 Jun 2021 15:45 IST

- ఓ సోదరి

జ: మీకు ఎందుకిలా జరుగుతోందో అర్థం కావాలంటే తప్పనిసరిగా యూరాలజిస్ట్‌ని సంప్రదించాలి. సిస్టోస్కోపీ చేసి చూసి.. అదే సమయంలో సన్నగా అయిన మూత్రనాళాన్ని వెడల్పు చేయడానికి యురెత్రల్‌ డైలెటేషన్‌ అన్న ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులు ఇలా లోపల యూరిన్‌ నిల్వ ఉంటే ఇది తప్పనిసరిగా ఇన్ఫెక్షన్‌కి దారి తీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్‌ క్రమంగా కిడ్నీల వరకు ఎగబాకి ప్రమాదకరమైన సమస్యలకు దారితీయచ్చు. అందుకని అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌కి చూపించుకొని చికిత్స తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్