Egg Slicers: గుడ్డును స్లైసుల్లా కట్ చేయాలంటే..!

ఉడికించిన కోడిగుడ్లను నేరుగా తినడంతో పాటు.. బర్గర్‌, శాండ్‌విచ్‌, సలాడ్‌.. వంటి పలు వంటకాల తయారీలోనూ వాడుతుంటాం. ఈ క్రమంలో వాటిని సగానికి కట్‌ చేయడం లేదంటే స్లైసుల్లా చేయడం.. ఇలా ఆయా రెసిపీకి తగ్గట్లుగా...

Published : 24 May 2023 17:54 IST

ఉడికించిన కోడిగుడ్లను నేరుగా తినడంతో పాటు.. బర్గర్‌, శాండ్‌విచ్‌, సలాడ్‌.. వంటి పలు వంటకాల తయారీలోనూ వాడుతుంటాం. ఈ క్రమంలో వాటిని సగానికి కట్‌ చేయడం లేదంటే స్లైసుల్లా చేయడం.. ఇలా ఆయా రెసిపీకి తగ్గట్లుగా వాటిని ముక్కలుగా చేస్తుంటాం. నిజానికి ఉడికించిన కోడిగుడ్డు పట్టుకుంటేనే జారిపోతుంది. అయినా ఎలాగోలా సగానికి కట్‌ చేయడం ఈజీనే! కానీ స్లైసుల్లా చేయడమే కష్టం. ఈ శ్రమను తగ్గించడానికే ‘ఎగ్‌ స్లైసర్స్‌’ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

లెమన్‌ స్క్వీజర్‌, కత్తెర, ప్రెసర్, కోడిగుడ్డు, కార్టూన్స్, 2 ఇన్‌ వన్‌ స్లైసర్ ఇలా విభిన్న ఆకృతుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ స్లైసర్స్‌లో ఉడికించిన గుడ్డు కదలకుండా బేస్‌పై అమర్చాలి. ఆపై సన్నటి స్లైసుల్లా, కాస్త పెద్ద ముక్కల్లా, తురిమేలా.. ఇలా మనకు కావాల్సినట్లుగా కట్‌ చేసుకోవడానికి వీలుగా కటర్స్‌ అమరి ఉన్న మూత ఉంటుంది. వాటిని గుడ్డుపై ప్రెస్‌ చేస్తే చాలు.. చిటికెలో అది కావాల్సినట్లుగా కట్‌ అవుతుంది. క్షణాల్లో సులభంగా గుడ్డును కట్‌ చేసుకునే ఇలాంటి స్లైసర్స్‌ ప్రస్తుతం స్టీల్‌లోనూ దొరుకుతున్నాయి. ఇక వీటిలో కేవలం కోడిగుడ్డే కాదు.. క్యారట్‌, బీట్‌రూట్‌, యాపిల్‌, కొన్ని రకాల పండ్లు, కాయగూరల్నీ సులభంగా కట్‌ చేసుకోవచ్చు. మరి, వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్