ఇలా చేస్తే ఎనామిల్ పోతుందా?
నా దంతాలు గార పట్టి పచ్చగా మారాయి. దాంతో ఒకసారి డాక్టర్ వద్దకు వెళ్లి పళ్లను శుభ్రం చేయించుకున్నాను. కానీ, కొన్ని రోజుల తర్వాత పళ్లు మళ్లీ పచ్చగా మారాయి. అయితే తరచుగా దంతాలు శుభ్రం చేయించుకుంటే పంటిపై ఉండే ఎనామిల్ పోతుందని అంటున్నారు.
నా దంతాలు గార పట్టి పచ్చగా మారాయి. దాంతో ఒకసారి డాక్టర్ వద్దకు వెళ్లి పళ్లను శుభ్రం చేయించుకున్నాను. కానీ, కొన్ని రోజుల తర్వాత పళ్లు మళ్లీ పచ్చగా మారాయి. అయితే తరచుగా దంతాలు శుభ్రం చేయించుకుంటే పంటిపై ఉండే ఎనామిల్ పోతుందని అంటున్నారు. ఇది నిజమేనా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. దంతాలను ప్రొఫెషనల్ డెంటిస్ట్ దగ్గర శుభ్రం చేయించుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. దంతాలపై ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉండదు. సాధారణంగా దంతాలపై ఉన్న గార (calculus)ను తొలగించడానికి ఒక మెషీన్ వాడుతుంటారు. ఈ మెషీన్ దంతాలకు ఎలాంటి నష్టం కలిగించదు. ఇది ఒక అల్ట్రాసానిక్ వైబ్రేటర్. పంటిపై గార ఉన్న ప్రదేశంలో ఈ మెషీన్ టిప్‌ను పెడుతుంటారు. ఆ ప్రదేశంలో వైబ్రేట్ అవుతూ పంటిపై ఉండే గార లాంటి చెక్కులు విడిపోయేలా చేస్తుంటుంది. అంటే గోడపై పెచ్చులు ఊడినట్లు పంటిపై గార తొలగిపోతుంది. అయితే కొంతమంది ఈ గారను సొంతంగా తొలగించుకోవడానికి పలు వస్తువులను ఉపయోగిస్తుంటారు. కానీ, ఇది ఏమాత్రం మంచిది కాదు.
దంత వైద్యుల దగ్గర పళ్లను శుభ్రం చేయించుకోవడాన్ని ‘ఓరల్ ప్రొఫైల్ యాక్సెస్’ అంటారు. దీనివల్ల పంటిపై ఉండే ఎనామిల్‌కు ఎలాంటి హానీ కలగదు. అయితే ఉదయాన్నే బ్రష్ చేసుకునేటప్పుడు గట్టి బ్రిజిల్స్ ఉండే బ్రష్‌లు వాడడం వల్ల ఎనామిల్ తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, సాఫ్ట్ బ్రష్‌లతో దంతాలు శుభ్రం చేసుకోవాలి. సాధారణంగా మన దంతాలు వివిధ ఆకృతుల్లో ఉంటాయి. కానీ, మనం ఉపయోగించే బ్రష్ నిటారుగా ఉంటుంది. దీనివల్ల మనం ఎంత జాగ్రత్తగా బ్రష్ చేసుకున్నప్పటికీ అన్ని భాగాలను సరిగా శుభ్రం చేసుకోలేం. కాబట్టి కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఓరల్ ప్రొఫైల్ యాక్సెస్ ద్వారా దంతాలు శుభ్రం చేయించుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
- అందానికి చింతపండు..!
- నిర్మలమ్మ ‘బడ్జెట్’ శారీస్.. చీరచీరకో ప్రత్యేకత!
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
ఆరోగ్యమస్తు
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
- ‘అమ్మా’ అనే పిలుపు వినాలని!
- మీ మౌత్‌వాష్ ఎలాంటిది?
- చాందీపుర వైరస్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
అనుబంధం
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- నియమం ‘777’తో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
- Sushmita Sen: లైంగిక అంశాల గురించి నా పిల్లలతో అలా చర్చిస్తా!
యూత్ కార్నర్
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
- రెండేళ్ల కష్టం... రూ.54 లక్షల ఉద్యోగం!
- మలార్ వాట్సాప్... టీచర్!
'స్వీట్' హోం
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!
- ఆఫీసులో ఒత్తిడి తగ్గుతుందిలా..