ఈ సీరంతో ముడతలు మాయం..

కొందరికి చిన్నవయసులోనే ముడతలు ఏర్పడతాయి. మూడు పదులు దాటకుండానే వయసు పైబడినట్లు కనిపిస్తారు. దీనికి పరిష్కారం ఇంట్లోనే  చేసుకోగలిగే ఈ సీరం. దీంతో మీ ముఖారవిందాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.

Updated : 16 Nov 2021 05:33 IST

కొందరికి చిన్నవయసులోనే ముడతలు ఏర్పడతాయి. మూడు పదులు దాటకుండానే వయసు పైబడినట్లు కనిపిస్తారు. దీనికి పరిష్కారం ఇంట్లోనే  చేసుకోగలిగే ఈ సీరం. దీంతో మీ ముఖారవిందాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.

పావుకప్పు నీళ్లలో ఆరు బాదం గింజలు, చెంచా అవిసె గింజలు వేసి నాలుగు గంటలు నాననివ్వాలి. తర్వాత బాదం గింజలపై తొక్కలను తీసి, అవిసె గింజలని కలిపి మిక్సీలోవేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో రెండు చెంచాల చొప్పున పాలు, కలబంద గుజ్జు, చెంచా చొప్పున బాదం నూనె, గ్లిజరిన్‌ వేసుకోవాలి. రెండు క్యాప్సుల్స్‌ ఇ విటమిన్‌ నూనె కూడా వేసి బాగా కలపాలి. ఈ సీరంను పొడిగా ఉన్న సీసాలోకి తీసి ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటే చాలు. వారం రోజులు వాడుకోవచ్చు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ముఖాన్ని శుభ్రపరుచుకుని ఈ సీరంను మృదువుగా అప్లై చేయాలి. ఇలా రోజూ చేస్తే ముఖంపై ముడతలు మాయమై కాంతు లీనుతుంది. బాదంలోని యాంటీఆక్సిడెంట్‌ గుణాలు ఫ్రీˆరాడికల్స్‌ను నిరోధించి ముడతలు రాకుండా కాపాడతాయి. కలబంద కొలాజెన్‌ను విడుదల చేసి చర్మాన్ని మృదువుగా మారిస్తే, ఇ విటమిన్‌ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ముఖంపై ఏర్పడే గీతలు, ముడతలను నిరోధిస్తుంది. గ్లిజరిన్‌ చర్మాన్ని తేమగా, మృదువుగా మారుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్