మెనోపాజ్‌లో క్యారెట్‌ మంచిది..

క్యారెట్లు నారింజ రంగులో అందంగా కనిపించడమే ఆరోగ్యానికెంతో మంచిది. వాటివల్ల ఎన్ని లాభాలున్నాయో మీరే చూడండి...

Updated : 15 Jun 2022 03:20 IST

క్యారెట్లు నారింజ రంగులో అందంగా కనిపించడమే ఆరోగ్యానికెంతో మంచిది. వాటివల్ల ఎన్ని లాభాలున్నాయో మీరే చూడండి...

* క్యారెట్‌లో ఎ,సి,కె,బి విటమిన్లు, ఐరన్‌, క్యాల్షియం, పొటాషియంలు ఉన్నందున ఇది మంచి పోషకాహారం.

* నెలసరి సక్రమంగా రాకపోవడం, రక్తం ఎక్కువ పోవడం లాంటి సమస్యలను నివారిస్తాయి. మెనోపాజ్‌ దశలో ఒంట్లోంచి వేడి ఆవిర్లు రావడం, మూడ్స్‌ మారిపోవడం కద్దు. అలాంటప్పుడు రోజూ ఒక క్యారెట్‌ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

* గర్భిణిగా ఉన్నప్పుడు, శిశువు పుట్టాక క్యారెట్లు తినడం వల్ల పాలు పడతాయి.

* అమ్మాయిలు ఎక్కువగా బాధ పడే అంశాల్లో జుట్టు రాలిపోవడం ఒకటి. క్యారెట్లు తినడం వల్ల జుట్టు రాలదు, బాగా పెరుగుతుంది. చర్మానికి నిగారింపు వస్తుంది. ముడతలు రానీయవు కనుక వయసు మీదపడినట్లు అనిపించదు.

* ఆకలిని పెంచుతాయి. గుండెకు మంచిది. హైబీపీని తగ్గిస్తాయి. టైప్‌-2 డయాబెటిస్‌ను తగ్గిస్తాయి. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు నయమౌతాయి. క్యాన్సర్‌ కారకాలను నియంత్రిస్తాయి.

* ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో కొవ్వు ఉండదు, కెలొరీలు తక్కువ కనుక ఊబకాయం రాదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇవెంతో ఉపకరిస్తాయి.

* పిల్లలకు మంచి పోషకాహారాన్ని అందించాలనుకునే తల్లులు ఏదో రూపంలో చిన్నారుల చేత క్యారెట్‌ తినిపిస్తారు.

* మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది ఆరెంజ్‌ రంగు కారెట్లు. కొన్ని ప్రాంతాల్లో ఇతర రంగులూ దొరుకుతాయి. నారింజ రంగువి శరీర ఛాయను మెరుగుపరిస్తే పసుపువి కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎర్రటివి శరీరంలో చేరిన మలినాలను బయటకు పంపితే, ఊదారంగువి వాపు, ఊబకాయ నివారణకు దోహదం చేస్తాయి. ముల్లంగికి మల్లే తెల్లగా ఉండే క్యారెట్లలో పీచు అధికంగా ఉన్నందున జీర్ణ ప్రక్రియకు మరీ మంచిది.

* క్యారెట్‌ జ్యూస్‌ తాగొచ్చు. ముక్కలు లేదా తురుము తినొచ్చు. ఉప్పు, నిమ్మ రసం, మిరియాల పొడి చేర్చి మరింత రుచిగా తినొచ్చు. క్యారెట్‌తో కూర, పచ్చడి చేయొచ్చు. చారులో వేస్తే అదనపు రుచి. ఇక క్యారెట్‌ హల్వా గురించి చెప్పాల్సిందేముంది...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్