ఆ సమయానికి సిద్ధమేనా?

నెలసరి.. ఏ అమ్మాయికైనా పెద్ద సమస్యే! వచ్చేదాకా ఎప్పుడు వస్తుందా అన్న కంగారు. వచ్చాకేమో ఇన్‌ఫెక్షన్ల భయం. కాలేజ్‌, ఆఫీసులకు వెళ్లేవారికి ఇది మరింత ఇబ్బంది. మరేం చేద్దాం? వీటిని దగ్గర పెట్టుకుంటే సరి! ఒత్తిడి, ఎక్కువగా శరీరం అలసిపోవడం, హార్మోనుల్లో అసమతౌల్యత కారణమేదైనా ఒక్కోసారి నెలసరి ముందు, వెనుకలవుతుంది. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. మరక భయం.....

Updated : 21 Jun 2022 05:14 IST

నెలసరి.. ఏ అమ్మాయికైనా పెద్ద సమస్యే! వచ్చేదాకా ఎప్పుడు వస్తుందా అన్న కంగారు. వచ్చాకేమో ఇన్‌ఫెక్షన్ల భయం. కాలేజ్‌, ఆఫీసులకు వెళ్లేవారికి ఇది మరింత ఇబ్బంది. మరేం చేద్దాం? వీటిని దగ్గర పెట్టుకుంటే సరి!

ప్యాంటీ లైనర్స్‌: ఒత్తిడి, ఎక్కువగా శరీరం అలసిపోవడం, హార్మోనుల్లో అసమతౌల్యత కారణమేదైనా ఒక్కోసారి నెలసరి ముందు, వెనుకలవుతుంది. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. మరక భయం. అలాంటప్పుడు ఈ ప్యాంటీ లైనర్‌ సాయపడుతుంది. ఇదీ ప్యాడ్‌ లాంటిదే! కాకపోతే కాస్త పలుచగా ఉంటుంది. ఏమాత్రం అనుమానం అనిపించినా దీని వెనుక నున్న స్టిక్కర్‌ను తీసేసి ప్యాంటీకి అతికిస్తే సరి. స్పాటింగ్‌, మరకల నుంచి తప్పించుకోవచ్చు.

టాయ్‌లెట్‌ సీట్‌ శానిటైజర్‌ స్ప్రే: ఇంట్లో సరే.. కానీ కాలేజ్‌, ఆఫీసుల్లో ప్రత్యేక టాయ్‌లెట్లు కష్టం కదా! మనకేమో ఇన్ఫెక్షన్ల భయం. ఆ సమయంలో ఈ ఆందోళన ఇంకా ఎక్కువ! అలాంటప్పుడు ఈ స్ప్రే పనికొస్తుంది. ఉపయోగించే ముందు టాయ్‌లెట్‌ మీద స్ప్రే చేస్తే సూక్ష్మజీవులు నశిస్తాయి. ఇన్ఫెక్షన్లూ దరిచేరవు.

ఇంటిమేట్‌ వెట్‌ వైప్స్‌: నెలసరి సమయంలో నిరంతర శుభ్రత తప్పనిసరి. అప్పుడు ఇవి సాయపడతాయి. ఆల్కహాల్‌ లేకుండా చర్మ పీహెచ్‌ను బ్యాలెన్స్‌ చేసేలా తయారు చేస్తున్నారు.

డిస్పోజబుల్‌ టాయ్‌లెట్‌ సీట్‌ కవర్స్‌: కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతుంటాయి. అలాగని టాయ్‌లెట్‌ వాడకుండా ఉండలేం. దీన్ని తెచ్చేసుకోండి. టాయ్‌లెట్‌ సీట్‌ మీద పరచుకుని, అవసరం అయిపోయాక తీసేస్తే సరి. ప్రయాణాల్లో పిల్లలు ఉన్నప్పుడూ ఇది చాలా ఉపయోగం.

ఇంటిమేట్‌ వాష్‌: జననాంగాలను సబ్బు, వాష్‌లతో శుభ్రం చేయకూడదు. రసాయనాల భయం, పీహెచ్‌ లెవల్‌ దెబ్బతినే ప్రమాదం. దానికి పరిష్కారమే ఈ ఇంటిమేట్‌ వాష్‌. వీటితోపాటు ఒకట్రెండు ప్యాడ్‌లను తప్పక దగ్గరుంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్