గుప్పెడంత పప్పులు కొండంత బలం!

నట్స్‌ తరచూ తీసుకోవడంవల్ల గుండె జబ్బులూ, టైప్‌ 2 మధుమేహం లాంటివి దూరం చేస్తాయని చాలా అధ్యయనాల్లో తేలింది. అయితే రోజూ వీటిని ఓ గుప్పెడు తీసుకుంటే, మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పుని సగానికి తగ్గాస్తాయని ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ క్యాన్సర్‌లో తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు, మరణించే ముప్పుని మూడో ...

Published : 25 Jun 2022 00:25 IST

ట్స్‌ తరచూ తీసుకోవడంవల్ల గుండె జబ్బులూ, టైప్‌ 2 మధుమేహం లాంటివి దూరం చేస్తాయని చాలా అధ్యయనాల్లో తేలింది. అయితే రోజూ వీటిని ఓ గుప్పెడు తీసుకుంటే, మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పుని సగానికి తగ్గాస్తాయని ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ క్యాన్సర్‌లో తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు, మరణించే ముప్పుని మూడో వంతుకు తగ్గిస్తాయట. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్‌నట్స్‌, వేరుసెనగ.. లాంటి అన్ని రకాల నట్స్‌కీ ఇది వర్తిస్తుంది. నట్స్‌లో ప్రొటీన్‌, అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌, విటమిన్లు, ఖనిజ లవణాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి రొమ్మ క్యాన్సర్‌కు కారణమయ్యే కణాల ఎదుగుదలను అడ్డుకుంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మర్చిపోవద్దు మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్