వ్యాయామం చేస్తే.. ప్రొటీన్‌ పౌడర్‌ తీసుకోవాలా?

నాకు 35 ఏళ్లు. బరువు తగ్గాలనుకుంటున్నా. అందుకని జిమ్‌లో చేరా. వాళ్లు వ్యాయామానికి ముందూ లేదా తర్వాతా ప్రొటీన్‌ పౌడర్‌ తాగమంటున్నారు.

Updated : 14 Jul 2022 12:40 IST

నాకు 35 ఏళ్లు. బరువు తగ్గాలనుకుంటున్నా. అందుకని జిమ్‌లో చేరా. వాళ్లు వ్యాయామానికి ముందూ లేదా తర్వాతా ప్రొటీన్‌ పౌడర్‌ తాగమంటున్నారు. ఇది కచ్చితంగా తీసుకోవాలా? సాధారణ ఆహారంతో ప్రొటీన్‌ తగినంత అందదా?

నం తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి తగినంత ప్రొటీన్‌ అందనప్పుడే బయట నుంచి అందించాల్సి ఉంటుంది. అలా చేసేముందు మీ ఆహారంలో ఎంత మేరకు మాంసకృత్తులు ఉంటున్నాయో గమనించుకోండి. పప్పు దినుసులు, గుడ్లు, పాలు, పెరుగు, నట్స్‌, మీల్‌ మేకర్‌... వీటినుంచి మాంసకృత్తులు అందుతాయి. మీ ఆహారంలో ఇవి తగిన మోతాదులో తీసుకుంటుంటే శరీరానికి సరిపడినంత ప్రొటీన్‌ అందుతున్నట్టే. సగటు భారతీయులు.. ముఖ్యంగా తెలుగువాళ్ల ఆహారపుటలవాట్లు చూసుకుంటే.. రోజూ 300 గ్రాముల గింజ ధాన్యాలు (వరి, గోధుమ, జొన్న) తీసుకుంటారు. ఇది సాధారణం కంటే ఎక్కువే. వీటిద్వారా 30 గ్రాముల వరకూ ప్రొటీన్‌ లభిస్తుంది. ఇవి కాకుండా టిఫిన్‌లో, కూరలుగా మినప్పప్పు, కందిపప్పు... ఇతర రకాల పప్పు దినుసులూ... పాలు, పాల పదార్థాలు తీసుకుంటాం. వీటన్నింటిద్వారా సగటు వ్యక్తికి అవసరమైన మోతాదులో మాంసకృత్తులు అందుతాయి. వీటితోపాటు గుడ్డు, చేపలు, మాంసం తీసుకుంటే మనకు అవసరమైన, ఇంకా చెప్పాలంటే మేలైన మాంసకృత్తులు అందుతాయి. బరువు తగ్గడానికి జిమ్‌లో చేరానంటున్నారు. వ్యాయామంతో ఎక్కువ క్యాలరీలు ఖర్చుచేసి తద్వారా బరువు తగ్గాలన్నదే కదా ఉద్దేశం. ఫిట్‌నెస్‌, కండరాల బలం కోసం వ్యాయామం చేసేవాళ్లు కూడా అదనంగా ప్రొటీన్‌ అవసరం అనుకుంటారు. కానీ ఇలాంటి వారికి కావాల్సిన పరిమాణంలో మాంసకృత్తులు ఆహారంద్వారా అందుతాయి. కాబట్టి బయట నుంచి ప్రొటీన్‌ తీసుకోవడం అవసరం ఉండదు. ఇంకా సందేహం ఉంటే, మీ శరీర బరువుని బట్టి దీన్ని నిర్థరించుకోవాలి. సాధారణంగా కిలో బరువుకి ఒక గ్రాము ప్రొటీన్‌ అవసరం. కండల్ని, శరీర బరువుని బాగా పెంచుకోవాలనుకునే వాళ్లకి కిలో బరువుకు 1.5 గ్రాముల ప్రొటీన్‌ అవసరం. వాళ్లకు ఆహారంలో తగిన మోతాదులో ప్రొటీన్‌ లభించకపోతే సప్లిమెంట్స్‌ ద్వారా తీసుకోవాలి. అంతే తప్ప వ్యాయామం చేసేవాళ్లందరూ కచ్చితంగా ప్రొటీన్‌ పౌడర్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. వ్యాయామంతో మీరు మరీ సన్నబడతారేమోన్న సందేహం ఉండొచ్చు. కానీ మీ శరీరంలో కండ నిల్వ ఉంటుంది. అది తరగదు. కేవలం కొవ్వు మాత్రమే కరుగుతుంది. కాబట్టి ఈ పౌడర్ల కోసం అదనంగా ఖర్చు చేయాల్సిన పనిలేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్