షుగర్‌.. నీరసం.. తగ్గాలంటే?

నాకు 45. ఈమధ్య మధుమేహం ఉన్నట్టు తేలడంతో ఆహారాన్ని నియంత్రణలోనే తీసుకుంటున్నా. కానీ ఇంట్లో, ఆఫీసులో పనులతో సాయంత్రానికి నీరసం వచ్చేస్తోంది. కొన్ని పౌడర్లు వాడితే రక్తంలో చక్కెరని నియంత్రణలో పెడుతూనే, నీరసాన్నీ తగ్గించుకోవచ్చని విన్నా. నిజమేనా?

Updated : 28 Jul 2022 12:37 IST

నాకు 45. ఈమధ్య మధుమేహం ఉన్నట్టు తేలడంతో ఆహారాన్ని నియంత్రణలోనే తీసుకుంటున్నా. కానీ ఇంట్లో, ఆఫీసులో పనులతో సాయంత్రానికి నీరసం వచ్చేస్తోంది. కొన్ని పౌడర్లు వాడితే రక్తంలో చక్కెరని నియంత్రణలో పెడుతూనే, నీరసాన్నీ తగ్గించుకోవచ్చని విన్నా. నిజమేనా?

- ఓ సోదరి, హైదరాబాద్‌

* ఉద్యోగినులు ఇంటి పనీ, ఆఫీసు కారణంగా మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవడం ఇబ్బందే. ప్రత్యేక దృష్టిపెడితే సమస్యనుంచి బయటపడొచ్చు. ఒకేసారి ఎక్కువగా తినడం, చాలాసేపు అస్సలే తినకపోవడంవల్ల చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. నియంత్రిత కేలరీలతోనే కావాల్సిన పోషకాల్నీ తీసుకోవచ్చు. ఆహారంలో నిదానంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్స్‌తోపాటు మేలైన మాంసకృత్తులు, పీచు, కొవ్వులు, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, కాల్షియం, విటమిన్‌-సి, బి- కాంప్లెక్స్‌ విటమిన్లు మొదలైన కీలకమైన పోషకాలు ఉండేట్టు చూసుకోవాలి. కొందరు షుగర్‌ నియంత్రణపైనే దృష్టిపెట్టి తక్కువ తినడం, కొన్ని పదార్థాలు అసలే తినకపోవడం చేస్తారు. అలాకాకుండా ఉదయాన్నే కప్పు తక్కువ ఫ్యాట్‌ ఉన్న పాలు తాగండి. టిఫిన్‌లో ఉడకబెట్టిన గుడ్డు, రెండు ఇడ్లీ- సాంబారు లేదా పెసరట్టు-పుదీనా పచ్చడి తీసుకోడి. 11 గంటలకి గుప్పెడు వేయించిన వేరుసెనగలూ గ్లాస్‌ మజ్జిగ/గ్రీన్‌ టీ తీసుకోండి. లంచ్‌లో గోధుమ రవ్వ, కొర్రల అన్నం, శాకాహార కూరలు, పెరుగు తినొచ్చు. ఇంకా ఆకలి ఉంటే కీరా, క్యారెట్‌, టొమాటో సలాడ్‌గా తీసుకోవచ్చు. ఇవి నిదానంగా జీర్ణమవుతాయి. సాయంత్రం కప్పు టీ/కాఫీ/పాలు తీసుకున్నా ఇబ్బంది ఉండదు. ఇంటికి చేరాక ఉడకబెట్టిన గుగ్గిళ్లు, పెసలు, అలసందలు, పాప్‌కార్న్‌, పండ్లు తీసుకోండి. రాత్రికి గోధుమ/దంపుడు బియ్యం అన్నం, కూరలు, సోయా నగ్గెట్స్‌, వారంలో 2-3 సార్లు 70 గ్రా. చికెన్‌, ఫిష్‌ తీసుకోవచ్చు. నూనె వినియోగాన్ని తగ్గించుకోండి. ఇవన్నీ సగటు వ్యక్తికి సూచించిన నియమాలు. మీ ఎత్తు, బరువు, శారీరక శ్రమకు తగ్గట్టు కాస్త అటూఇటూగా మార్చుకుని ఈ నియమాల్ని పాటిస్తే.. నెలరోజులకు శక్తి వచ్చి నీరసం పోతుంది. సంవృద్ధ ఆహారం, శారీరక శ్రమ లేకపోతే ఏ పౌడర్లూ మీ సమస్యని పరిష్కరించలేవు. ఆహారం తీసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడే అంటే ప్రయాణాల్లో, ఏదైనా సమస్యతో హాస్పిటల్‌లో చేరినపుడో మాత్రమే పౌడర్‌ తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్