స్నానానికి సెలవొద్దు

అదితికి వాతావరణం చల్లగా ఉంటే చాలు స్నానానికి సెలవు పెట్టేస్తుంది. వర్షం కురుస్తోంది.. వాతావరణం చల్లగా ఉందనో స్నానం మానేస్తే అనారోగ్యాలకు ఆహ్వానం పలికినట్లే అంటున్నారు నిపుణులు.

Published : 04 Aug 2022 18:19 IST

అదితికి వాతావరణం చల్లగా ఉంటే చాలు స్నానానికి సెలవు పెట్టేస్తుంది. వర్షం కురుస్తోంది.. వాతావరణం చల్లగా ఉందనో స్నానం మానేస్తే అనారోగ్యాలకు ఆహ్వానం పలికినట్లే అంటున్నారు నిపుణులు.

ర్షాకాలంలో రోజూ రెండుసార్లు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. శరీరంపై పేరుకొనే మృతకణాలను స్నానంతో తొలగించకపోతే వాటి కారణంగా పలురకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది. జననేంద్రియాల వద్ద పేరుకునే మృతకణాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. లేదంటే ఆ ప్రాంతాల్లో బాక్టీరియా చేరి చర్మవ్యాధులు వస్తాయి. అక్కడి నుంచి అవి మిగతా అవయవాలకు కూడా సోకుతాయి.

ప్రయోజనాలు.. వాతావరణం చల్లగానే ఉంది కదా అనుకోకూడదు. పరిసరాలెలా ఉన్నా.. చర్మంపైన మృత కణాలు పేరుకొనే ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. శరీరాన్ని శుభ్రం చేయకుండా ఉంటే, వీటి కారణంగా దుర్వాసన మొదలవుతుంది. అందుకే ఉదయం, రాత్రి నిద్ర పోయే ముందు స్నానం తప్పనిసరి. దీంతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది. శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కండరాలకు వ్యాయామంగానూ ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

నెలసరికి.. రక్తస్రావం, నెలసరి నొప్పి ఈ కారణాలతో స్నానానికి విరామం ఇద్దామనుకోకూడదు. పైగా ఈ సమయంలో ఎంత శుభ్రత పాటిస్తే అంత మంచిది. అనారోగ్యాలు దరిచేరవు. రోజుకి కనీసం రెండుసార్లు స్నానం, జననేంద్రియాల వద్ద శుభ్రంగా ఉండేలా జాగ్రత్తపడితే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. బయటి నుంచి వచ్చిన వెంటనే స్నానం చేయడం, శానిటరీ ప్యాడ్‌ మార్చుకోవడం, వదులైన దుస్తులు ధరించడం వల్ల చికాకు తగ్గి, శారీరకంగానే కాదు, మానసికంగానూ ప్రశాంతంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్