ఈ నూనెలు నిద్ర పట్టిస్తాయి..

రోజుకి కనీసం ఏడుగంటల నిద్ర ఆరోగ్యాన్నిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా కంటినిండా నిద్రపోవాలా.. ఈ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ సాయపడతాయి.

Published : 23 Sep 2022 00:27 IST

రోజుకి కనీసం ఏడుగంటల నిద్ర ఆరోగ్యాన్నిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా కంటినిండా నిద్రపోవాలా.. ఈ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ సాయపడతాయి.

సంపెంగ నూనె.. నిద్రపుచ్చే గుణాలు ఇందులో పుష్కలం. నిద్రపోయే ముందు రెండు చుక్కల నూనె వేసిన గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చాలు. ఈ సువాసన ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది. 

ఫ్రాంకిన్‌సెన్స్‌.. ఈ ఎసెన్షియల్‌ ఆయిల్‌  మెదడుకు విశ్రాంతినిచ్చి ఒత్తిడి, ఆందోళన దూరమయ్యేలా చేస్తుంది. చిన్న గిన్నెలో నాలుగైదు చుక్కల నూనె వేసి పడకగదిలో ఓమూల ఉంచితే చాలు. లావెండర్‌ నూనెలో ముంచిన దూది ఉండలను నిద్రపోయే ముందు వాసన చూసినా, మంచం పక్కగా నాలుగైదు చుక్కల ఈ నూనె వేసిన గిన్నెనుంచినా మెదడును ప్రశాంతంగా మారుస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది. 

బెంజోన్‌ ఎస్సెన్షియల్‌.. సాంబ్రాణి నుంచి తయారయ్యే ఈ నూనె శ్వాసను తేలికగా తీసుకునేలా చేసి నిద్రపట్టడానికి సహాయపడుతుంది. ఇందులో ముంచిన దూది ఉండను పడుకునే ముందు వాసన చూస్తే సరి. ఒత్తిడి, శ్వాసనాళాల వాపువల్ల కలిగే నిద్రలేమికి దూరంగా ఉండొచ్చు.

ఇంకా.. గంధంనూనె.. రక్తపోటుతో నిద్రకు దూరమయ్యేవారికి ఔషధంలా పనిచేస్తుంది. రాత్రుళ్లు పదే పదే మెలకువ వచ్చేవారు వలేరియన్‌ వేరు నూనెను మూడునాలుగు చుక్కలు ఒక గిన్నెలో వేసి పడకగదిలో ఉంచితే చాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్