వ్యాయామంతో మరుపు దూరం

పురుషులతో పోలిస్తే మహిళల జీవిత కాలం ఎక్కువ. మతిమరుపు కేసులు మాత్రం రెట్టింపు. ఓ వయసుకి వచ్చాక మనలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గి మెదడు కణాలు త్వరగా చనిపోవడమే ఇందుకు కారణం. మతిమరుపు సమస్యని నివారించలేం.

Published : 20 Oct 2022 00:18 IST

పురుషులతో పోలిస్తే మహిళల జీవిత కాలం ఎక్కువ. మతిమరుపు కేసులు మాత్రం రెట్టింపు. ఓ వయసుకి వచ్చాక మనలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గి మెదడు కణాలు త్వరగా చనిపోవడమే ఇందుకు కారణం. మతిమరుపు సమస్యని నివారించలేం. కానీ దీన్ని ఆలస్యం చేయొచ్చు, తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.

* రోజూ కనీసం 30 నిమిషాలు బ్రిస్క్‌ వాక్‌ చేయాలి. వయసు పెరిగే కొద్దీ ఈ సమయాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే వయసుతోపాటు శరీరంలో శక్తి క్షీణిస్తుంది.

* నిద్ర చాలా ముఖ్యం. కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. అలాగే తొమ్మిది గంటలకు మించి నిద్రపోకూడదు. ఎక్కువ నిద్రవల్ల శరీరానికీ, మెదడుకూ తగినంత వ్యాయామం దొరకదు.

* ఒత్తిడిని దరిచేరనివ్వొద్దు. దీర్ఘకాలం దానితో బాధపడ్డా శరీరం వాపుని నియంత్రించలేదు. దానివల్ల కూడా గుండె జబ్బులు, మధుమేహం, మతిమరుపు వస్తాయి.

* శరీరంలో హానికర కొవ్వులు ఎక్కువైనా పక్షవాతం, గుండె జబ్బులు, రక్తనాళాల సమస్యలు వస్తాయి. ఇవన్నీ మతిమరుపుని దగ్గర చేస్తాయి. వీటిని జీవనశైలి మార్పులతోనే నియంత్రణలో పెట్టుకోవడం మేలు.

* బీపీని అదుపులో పెట్టాలి. బరువు పెరగకుండా చూసుకోవడం, ఉప్పు తగ్గించడం, వ్యాయామాలతో ఇది సాధ్యం.

* మతిమరుపుని దూరంగా పెట్టడానికి ఉన్న మార్గాల్లో సామాజిక జీవనమూ ముఖ్యమే. కొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవడం వాటిని ఉపయోగించడం, బృందంతో కలిసి పనిచేయడం ఇవీ మేలు చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్