వర్కవుట్‌ మారిస్తే పోలా...!

వ్యాయామం చేయాలన్న ఆలోచన రాగానే ఏదో ఒకటి మొదలు పెట్టేయాలనుకుంటారు చాలామంది. అలాకాకుండా, మీ సమస్య, అవసరం...అన్నీ దృష్టిలో పెట్టుకుని చేయాలి.

Published : 07 Nov 2022 00:17 IST

వ్యాయామం చేయాలన్న ఆలోచన రాగానే ఏదో ఒకటి మొదలు పెట్టేయాలనుకుంటారు చాలామంది. అలాకాకుండా, మీ సమస్య, అవసరం...అన్నీ దృష్టిలో పెట్టుకుని చేయాలి. అప్పుడే మీరు కోరుకున్న ఫలితం వస్తుంది.

* వ్యాయామం అందరికీ అవసరం. అయితే, మహిళల అవసరాలు కాస్త భిన్నంగా ఉంటాయి. కొందరికి యాంగ్జైటీ, మరికొందరికి థైరాయిడ్‌, ఇంకొందరికి పీసీఓడీ... సమస్య ఏదైనా వారి శారీరక స్థితి, అనారోగ్యాలు వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని వ్యాయామ ప్రణాళిక వేసుకోవాలి. ఆ తర్వాతే యోగా, జుంబా, ట్రెడ్‌ మిల్‌...ఇలా ఏదైనా సరే! లేదంటే లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు.

* ఇంటిపనీ, వంటపనీ చేసుకునేప్పటికే బోలెడంత అలసట....ఇంకెక్కడ వ్యాయామం అంటుంటారు కొందరు మహిళలు. అది నిజమే కావొచ్చు. ఇంటి పనులూ శ్రమతో కూడుకున్నవే అయినప్పటికీ ఓ క్రమ పద్ధతిలో చేయకపోవడం వల్ల ఫలితం పూర్తిస్థాయిలో శరీరానికీ, అంతకంటే మించి మెదడుకీ అందదు. అందుకే ఇంటి పనుల్నీ కూడా పుషప్స్‌, పులప్స్‌...అంటూ లెక్కేసుకుని చేస్తే మీ పని సరదాగా పూర్తవుతుంది.

* బరువు తగ్గాలని పెట్టుకునే లక్ష్యం వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అంతేకాని చేరుకోలేని వాస్తవాలని అంటే ఒక నెలలో కనీసం ఐదు కేజీలు తగ్గిపోవాలి వంటి భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవద్దు. దానివల్ల నిరాశే తప్ప సానుకూల ఫలితాలు సాధించలేం. ప్రతి నెలా వ్యాయామాల్ని మారుస్తూ ఉండాలి. నిపుణుల సాయంతో కొత్త తరహా కసరత్తుల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి ఒకేలాంటివి చేయడం వల్ల కొత్తగా వచ్చే ఫలితాలు కూడా ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్