పొట్ట తగ్గించేస్తాయ్‌!

బరువున్న వాళ్లకే కాదు.. సన్నగా ఉన్న అమ్మాయిలకూ పొట్ట దగ్గర కొవ్వు పెద్ద సమస్యే! చీర, జీన్స్‌ ఏది వేసుకున్నా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. పని, మారుతున్న జీవన శైలీ ఇందుకు కారణమే.

Published : 08 Nov 2022 00:49 IST

బరువున్న వాళ్లకే కాదు.. సన్నగా ఉన్న అమ్మాయిలకూ పొట్ట దగ్గర కొవ్వు పెద్ద సమస్యే! చీర, జీన్స్‌ ఏది వేసుకున్నా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. పని, మారుతున్న జీవన శైలీ ఇందుకు కారణమే. తగ్గించుకోవాలా.. ఇవి సాయపడతాయి.

* మెంతులు... జీర్ణప్రక్రియను మెరుగు పరచడంతోపాటు బరువును తగ్గించడంలోనూ సాయపడతాయి. వీటిలో ఉండే గ్యాలక్టోమనన్‌ ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగించి, త్వరగా ఆకలవ్వకుండా చేస్తుంది. మెటబాలిజమ్‌ను మెరుగుపరచి పొట్టతోపాటు ఇతర అవయవాల్లోని అదనపు కొవ్వు తగ్గేలా చేస్తాయి. వీటిని రోజూ ఆహారంలో చేర్చుకుంటే సరి.

* దాల్చినచెక్క.. ఉదయాన్నే టీ, నీటితో కలిపి.. ఎలా తీసుకున్నా ఆరోగ్యదాయకమే. దీనిలోని యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు చాలా జబ్బుల్ని దరి చేరనీయవు. యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలిజమ్‌ను మెరుగుపరచి కొవ్వును తగ్గించడంలో సాయపడతాయి.

* జాజికాయ... వంటకాల రుచిని పెంచడంలో సాయపడే ఈ సుగంధ ద్రవ్యంలో ఔషధ గుణాలెక్కువ. శరీరంలో పేరుకొన్న కొవ్వును తగ్గించడంతోపాటు సుఖ నిద్రనీ అందిస్తుంది. దీనిపొడిని ఆహారంగా లేదా నీటిలో కలిపి తాగినా ప్రయోజనకరమే.

* సోంపు.. భోజనమయ్యాక కాస్త సోంపు తింటే గానీ చాలామందికి తృప్తిగా అనిపించదు. దీనిలో ఫైబర్‌, విటమిన్‌సి, ఐరన్‌, పొటాషియం ఉంటాయి. భోజనానికి అరగంట ముందు దీనితో చేసిన టీ లేదా సోంపును నేరుగా తీసుకున్నా ఆకలిని తగ్గిస్తుందట. తద్వారా కొవ్వు కరిగేలా చేస్తుంది. వృద్ధాప్య ఛాయల్ని, గుండె జబ్బుల్ని దూరంగా ఉంచుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్