ప్రేమతో చేయండి!

షూటింగ్‌లున్నా.. ఇంట్లో ఖాళీగా ఉన్నా.. వ్యాయామం తప్పని సరి. లావుగా లేవుగా ఎందుకంత కష్టపడతావని అందరూ అడుగుతారు.

Updated : 13 Nov 2022 03:24 IST

అనుభవపాఠం

షూటింగ్‌లున్నా.. ఇంట్లో ఖాళీగా ఉన్నా.. వ్యాయామం తప్పని సరి. లావుగా లేవుగా ఎందుకంత కష్టపడతావని అందరూ అడుగుతారు. వ్యాయామాలు కొవ్వు తగ్గించుకోవడానికే అని ఎవరు చెప్పారు? నేను శారీరక, మానసిక ఆరోగ్యానికి చేస్తా. అందుకే ఒక్కరోజు చేయకపోయినా ఏదో వెలితి. మీరూ వర్కవుట్లు మీకోసం చేయండి. ఎవరో అన్నారనీ, ఇంకెవరినో మెప్పించాలనీ కాదు. అలాగే కనిపించే తీరు నచ్చకా కాదు. మీ శరీరంపై ప్రేమతో చేయండి. అప్పుడే ఆరోగ్యం, ఆనందం సొంతమవుతాయి. అలాగని ఎప్పుడూ జిమ్‌లోనే కుస్తీ పడనక్కర్లేదు. అలా ప్రకృతి ఒడిలోకీ వెళుతుండండి. మీలోని చిన్న పిల్లని తట్టిలేపి.. చేయాలనుకున్నవన్నీ చేసేయండి. అప్పుడే మనసు సానుకూలతతో నిండి పోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్