మతిమరపు తగ్గాలంటే...

మనల్ని హడలగొట్టే ఆరోగ్య సమస్యల్లో అల్జీమర్స్‌ ఒకటి. ఇది జ్ఞాపకశక్తిని చీడ పురుగులా తొలిచి మానసికంగా డొల్ల చేసి పారేస్తుంది. ఆ భయానక వ్యాధికి వైద్య శాస్త్రంలో దాదాపుగా మందులూ చికిత్సా లేవు.

Updated : 25 Mar 2023 16:58 IST

మనల్ని హడలగొట్టే ఆరోగ్య సమస్యల్లో అల్జీమర్స్‌ ఒకటి. ఇది జ్ఞాపకశక్తిని చీడ పురుగులా తొలిచి మానసికంగా డొల్ల చేసి పారేస్తుంది. ఆ భయానక వ్యాధికి వైద్య శాస్త్రంలో దాదాపుగా మందులూ చికిత్సా లేవు. కానీ యోగాసనాలతో దాని బారిన పడకుండా ఉండొచ్చంటే అతిశయోక్తి కాదు. జ్ఞాపకశక్తి క్షీణించకూడదనుకున్నా, అప్పుడప్పుడే మతిమరపు వచ్చినట్లనిపించినా విమానాసనం ప్రయత్నించండి. ఎంత మార్పు వస్తుందో మీకే అర్థమవుతుంది.

ఎలా చేయాలంటే... ఇది నిలబడి చేసే ఆసనం. రెండు కాళ్లూ దగ్గరగా పెట్టుకుని నిలబడాలి. మెల్లగా నడుము భాగాన్ని ముందుకు వంచి ఫొటోలో చూపినట్టు ఎడమ కాలిను పైకి లేపాలి. రెండు చేతులనూ భుజాలకు సమాంతరంగా చాచాలి. రెండు కాళ్లూ మోకాలి దగ్గర వంచకుండా తిన్నగా ఉండాలి. ఎత్తిన కాలు తల నుంచి పాదం వరకూ సరళ రేఖలా తిన్నగా ఉండాలి. ఇలా ఎంతసేపు బ్యాలెన్స్‌ చేయగలిగితే అంతసేపు ఉండాలి.

ప్రయోజనాలు... విమానాసనం వల్ల కాళ్లు బలం పుంజుకుంటాయి. శరీర కింది భాగం దృఢంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా స్థిరత్వం చేకూరుతుంది. మెదడును ఉత్తేజితం చేస్తుంది. మతిమరపు రాదు. భావోద్వేగాలను అణచుకోగలుగుతాం. పిల్లలతో ఈ ఆసనం చేయిస్తే ఏకాగ్రత పెరుగుతుంది. చదువు మీద మనసు లగ్నం చేయగలుగుతారు. అల్జీమర్స్‌ ఉన్నవాళ్లు, పార్కిన్‌సన్‌తో బాధ పడుతున్న వారికి ఎంతో ఉపయోగం. సమస్య తీవ్రత తగ్గుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్