ఎత్తు పెరగడానికో ఆసనం

ప్రతి తల్లికీ తన పిల్లలు తగినంత ఎత్తూ బరువులతో అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది. కానీ కొందరు పొడవు పెరగకపోవడం కద్దు. ఆ సమస్యను నివారించేందుకు ఒక ఆసనం ఉంది తెలుసా?! ఇందులో అతిశయమేమీ లేదు.

Published : 26 Nov 2022 00:14 IST

ప్రతి తల్లికీ తన పిల్లలు తగినంత ఎత్తూ బరువులతో అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది. కానీ కొందరు పొడవు పెరగకపోవడం కద్దు. ఆ సమస్యను నివారించేందుకు ఒక ఆసనం ఉంది తెలుసా?! ఇందులో అతిశయమేమీ లేదు. కావాలంటే మీ చిన్నారులతో వృక్షాసనం వేయించి చూడండి.

ఎలా చేయాలి... చెట్టును పోలిన ఆసనం కనుక దీన్ని ‘వృక్షాసనం’ అన్నారు. రెండు కాళ్లూ దగ్గర పెట్టుకుని నిలబడాలి. మెల్లగా కుడికాలును పైకి లేపి కుడి పాదాన్ని ఎడమ తొడ మీద ఆనించి అరికాలితో కొద్దిగా నొక్కుతున్నట్లుగా ఉంచి ఒక్క కాలిమీద నిలబడాలి. మెల్లగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులనూ భుజాల మీదుగా తల పైకి తిన్నగా తీసికెళ్లి నమస్కార ముద్రలో ఉంచాలి. చూపును ముక్కు అంచు మీద కేంద్రీకరించాలి. ఈ ఆసనంలో ఉండగలిగినంత సేపు ఉండాలి. మెల్లగా చేతులను, కాలును కిందికి దింపి సేద తీరాలి. ఇలాగే రెండో కాలితో చేయాలి. రెండు కాళ్లతో కలిపి రోజూ ఐదు నిమిషాలు చేస్తే సత్ఫలితం ఉంటుంది.

ఎన్నో ప్రయోజనాలు... ఇది బ్యాలెన్సింగ్‌ ఆసనం కనుక మనల్ని మనం నియంత్రించు కోగలుగుతాం. క్రమం తప్పకుండా  చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. పని మీద ధ్యాస నిలిపి అనుకున్నది సాధించ గలుగుతారు. పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల బాగుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్