కెలొరీలు లేకుండా... తిందామా!

బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకుని గంటల కొద్దీ వ్యాయామం చేస్తే చాలనుకుంటారు చాలామంది. కానీ, సమతుల పోషకాహారాన్ని కడుపు నిండా తీసుకుంటూనే బరువు తగ్గాలంటారు ఫిట్‌నెస్‌ నిపుణులు.

Updated : 28 Nov 2022 09:29 IST

బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకుని గంటల కొద్దీ వ్యాయామం చేస్తే చాలనుకుంటారు చాలామంది. కానీ, సమతుల పోషకాహారాన్ని కడుపు నిండా తీసుకుంటూనే బరువు తగ్గాలంటారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అందుకోసం ఈ ఆహారం ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.

గుడ్డు

మన రోజువారీ ఆహారంలో ప్రొటీన్ల పాత్ర చాలా కీలకం. రోజంతా చురుగ్గా ఉండటానికి ఈ ఆహారమే ఉపయోగపడుతుంది. ఉదయం పూట తినే అల్పాహారంలో ఒక గుడ్డుని చేర్చుకుంటే ఎంతో మేలు. ఎందుకంటే సగటున గుడ్డు నుంచి ఆరుగ్రాముల ప్రొటీన్లు అందుతాయి. కెలొరీలు 72. బరువు తగ్గాలి అనుకునేవారు రోజూ ఉడకబెట్టిన గుడ్డునితినడం వల్ల అన్ని పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటారు. బరువూ సమస్యా తగ్గుతుంది.

ఆపిల్‌ పండ్లు

అన్ని కాలాల్లోనూ దొరికే ఆపిల్‌ పండ్లని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు... శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా చూస్తాయి. వీటితోపాటూ రోజువారీ ఆహారంలో క్యాలీఫ్లవర్‌, గుమ్మడి, పాలకూర వంటి వాటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఎముకల సమస్యలు రాకుండా ఉంటాయి.

వాల్‌నట్లు/ బాదం

మహిళలు మల్టీటాస్కింగ్‌ చేసేస్తుంటారు. పని ఒత్తిడి క్రమంగా మెదడు పనితీరుపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అలాకాకూడదంటే రోజూ గుప్పెడు వాల్‌నట్లూ లేదా బాదం గింజల్ని తప్పనిసరిగా తినాలి. వీటిల్లోని క్యాల్షియం, ప్రొటీన్లూ, ఒమెగా త్రీ ఆమ్లాలు మేలు చేస్తాయి.

టొమాటో సాస్‌

టొమాటోలో ఉండే లైకోపిన్‌ వల్ల మగవాళ్లకంటే మహిళలకే ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే... లైకోపిన్‌ రక్తంలో ఎక్కువ ఉండటం వల్ల మహిళలకు 32 శాతం గుండె జబ్బులు రాకుండా ఉంటాయని పలు అధ్యయనాలూ చెబుతున్నాయి.

ఎండు ఖర్జూరాలు

ఎముకలు గుల్లబారే సమస్య మహిళల్లోనే ఎక్కువ. కాల్షియం లోపం కారణంగా ఎముకలు విరిగిపోతుంటాయి. దీనికి పరిష్కారం ఎండు ఖర్జూరాలు. ఐరన్‌తో పాటు ప్రొటీన్‌, మినరల్స్‌ ఎక్కువగా ఉండే వీటిని రోజూ తినడం వల్ల  ఎముక సాంద్రత గణనీయంగా పెరుగుతుంది. కండరాలూ పుష్టిగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్