నెలసరి ఆలస్యమవుతోందా?

మనలో చాలామందిని ఇబ్బంది పెట్టే విషయం ఇది. మెనోపాజ్‌ దగ్గరయ్యే కొద్దీ ఈ సమస్య సాధారణమే.

Published : 02 Dec 2022 00:37 IST

మనలో చాలామందిని ఇబ్బంది పెట్టే విషయం ఇది. మెనోపాజ్‌ దగ్గరయ్యే కొద్దీ ఈ సమస్య సాధారణమే. కొత్తగా యవ్వనంలోకి అడుగుపెడుతున్న అమ్మాయిల్లోనూ ఇది కనిపిస్తోంది.

* సన్నగా, నాజూగ్గా ఉంటేనే అందం.. అన్న ధోరణి చాలామందిది. డైట్‌ పేరుతో పేరుకు కొద్దిగా నోట్లో వేసుకుంటారు. కొందరేమో జంక్‌ఫుడ్‌కి ప్రాణమిస్తారు. ఫలితమే లావు. బరువు తక్కువున్నా, ఎక్కువున్నా అది పీరియడ్‌ మీదే ప్రభావం చూపుతుంది.

* చదువుకునేప్పుడు ర్యాంకుల గురించి, ఆఫీసులో పని ఒత్తిడి. ఇంటి బాధ్యతలూ తోడైతే.. మల్టీటాస్కింగ్‌ పెరిగి, నిద్ర కరవవుతోంది. దీంతో ఒత్తిడి.. ఇది ఎక్కువైతే ఆ ప్రభావం నెలసరి మీదే.

* మధుమేహం, థైరాయిడ్‌ సమస్యలున్నా నెలసరి సరిగా రాదు. హార్మోనుల్లో అసమతుల్యత పీసీఓఎస్‌కి దారితీస్తుంది. దీనివల్ల భవిష్యత్తులోనూ సమస్యే! ఎప్పుడో ఒకసారి ఆలస్యమైతే ఫర్లేదు. తరచూ ఇలాగే జరుగుతోంటే తప్పక పరీక్షలు చేయించుకోవాలి.


ఇవే కాదు.. విపరీతమైన రక్తస్రావం, నెలసరిలో జ్వరం వచ్చినట్లుగా అనిపించడం, భరించలేని నొప్పి వంటివి కనిపిస్తున్నా.. రక్తస్రావం 6 రోజులకు మించినా వైద్యుల్ని సంప్రదించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్