అమ్మాయిలూ పరుగెడదామా!

మహిళలు... వ్యాయాయం అంటే మొదట నడకకే ప్రాధాన్యం ఇస్తారు. పరుగు పెట్టమంటే బోలెడు కారణాలు చెబుతారు.

Published : 04 Dec 2022 00:03 IST

మహిళలు... వ్యాయాయం అంటే మొదట నడకకే ప్రాధాన్యం ఇస్తారు. పరుగు పెట్టమంటే బోలెడు కారణాలు చెబుతారు. ఇందుకోసం గ్రౌండ్‌లోనే కాదు ఇంట్లో ఉన్న చోటే ఉండీ పరుగు తీయొచ్చు. దీనివల్ల బోలెడు ప్రయోజనాలు అంటారు వ్యాయామ నిపుణులు.

* మొదట వేగంగా నడవండి. ఆపై పరుగు లాంటి నడకతో మొదలుపెట్టండి. రెండు రోజుల తర్వాత పరుగు వేగం అందుకుంటుంది. దీనివల్ల ఎక్కువ కెలొరీలు ఖర్చయి వేగంగా బరువు తగ్గుతారు. అంతే కాదు, కండరాలూ దృఢంగా మారతాయి.

* రక్తప్రసరణ సమస్యలు, అధికరక్తపోటు, గుండె సమస్యలూ అదుపులోకి వస్తాయి. శరీరం తీరైన ఆకృతి సంతరించుకుంటుంది. ఆరోగ్యకరమైన చర్మం సొంతమవుతుంది.

* కండరాలు దృఢంగా మారడంతోపాటూ, శరీరం కూడా తీరైన ఆకృతిలోకి వస్తుంది. పరుగు వల్ల మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సగానికి తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్