బాలింతలకు మేలుచేసే నారింజ

ఈ కాలంలో నారింజ పండ్లకు లోటు లేదు. కానీ కమలాలను ఇష్టపడినట్లుగా వాటి పట్ల మక్కువ కలగదు.

Updated : 06 Dec 2022 05:45 IST

ఈ కాలంలో నారింజ పండ్లకు లోటు లేదు. కానీ కమలాలను ఇష్టపడినట్లుగా వాటి పట్ల మక్కువ కలగదు. ఆ ఆకుపచ్చ రంగు చూడగానే పుల్లగా ఉంటాయనో, జలుబు చేస్తుందనో మనలో చాలామంది వెనకడుగు వేస్తుంటాం! కానీ సీజన్లలో దొరికే పండ్లను తప్పకుండా తినమంటున్నారు ఆహార నిపుణులు. నారింజలు ఎంత మేలు చేస్తాయో తెలుసుకుంటే వాటిని నిర్లక్ష్యం చేయరు...

* నారింజలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు, పీచు ఉన్నందున ఇదెంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మెండుగా ఉన్న సి-విటమిన్‌ రోగనిరోధకశక్తిని పెంచి జలుబూ జ్వరాల వంటి సాధారణ సమస్యలు మొదలు ఇతర అనారోగ్యాలనూ రానివ్వదు.

* గర్భిణీ, బాలింత, నవజాత శిశువులకు అవసరమైన బి-9 విటమిన్‌ నారింజలో సహజ సిద్ధంగా దొరుకుతుంది.

* నారింజరసం తాగడం వల్ల కంటిచూపు మెరుగ్గా ఉంటుంది. చర్మం మృదువుగా, నిగారింపుతో ఉంటుంది.

* మధుమేహ రోగులు కూడా నారింజ పండ్లు భేషుగ్గా తినొచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. 

* ఎనీమియాతో బాధపడుతున్న వారు ఈ రసం తీసుకోవడం వల్ల సత్వర ఫలితం ఉంటుంది.

* వీటిలోని పీచు జీర్ణప్రక్రియకు దోహదం చేస్తే, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గాయాలను త్వరగా మాన్పుతాయి.

* శరీరం ఐరన్‌ను త్వరగా గ్రహించేలా చేస్తాయీ పండ్లు. కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తాయి. గుండెజబ్బులు, ఆర్థరైటిస్‌లను నియంత్రిస్తాయి. క్యాన్సర్‌, అల్జీమర్స్‌ లాంటి మహమ్మారులను నిరోధిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

* ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

* ఈ పండును కోసిన వెంటనే తినాలి. ఆలస్యమైనకొద్దీ సి-విటమిన్‌ ఆవిరైపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్