హార్మోన్ల సమస్యా! ఇవి తినండి

వయసు పెరుగుతున్నప్పుడు లేదా అనారోగ్య కారణాల వల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ పరిస్థితి మనలో శారీరక, మానసిక మార్పులకీ, భావోద్వేగాలకీ కారణమవుతుంది.

Updated : 07 Dec 2022 04:13 IST

వయసు పెరుగుతున్నప్పుడు లేదా అనారోగ్య కారణాల వల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ పరిస్థితి మనలో శారీరక, మానసిక మార్పులకీ, భావోద్వేగాలకీ కారణమవుతుంది. బరువుపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. ఇవన్నీ అదుపులో ఉండాలంటే హార్మోన్లని అదుపులో ఉంచే ఆహారంపై దృష్టి పెట్టాలి.. 

* హార్మోన్లకి, ప్రొటీన్లకి బలమైన సంబంధం ఉంది. అల్పాహారం, భోజనాల్లో ఎంత సమృద్ధిగా ప్రొటీన్లని తీసుకుంటే అంతగా హార్మోన్లతో వచ్చే ఒత్తిడి, అధికబరువు, చికాకు, గర్భధారణ సమస్యలు వంటివి ఉండవు. ఆకలిని పెంచే హార్మోన్లని అదుపులో ఉంచి.. ఆకలిని నియంత్రించే హార్మోన్లని విడుదల చేస్తాయి. టీనేజీ పిల్లలు తప్పనిసరిగా పాటించాల్సిన నియమం ఇది. ప్రతి భోజనంలో కనీసం 30గ్రా ప్రొటీన్‌ ఉండేట్టు చూసుకోవాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, చికెన్‌ ఇందుకు సహకరిస్తాయి.

* తీపిని ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమే. పంచదార, తేనె వంటివి హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

* ఆరోగ్యకరమైన కొవ్వులు ముఖ్యంగా ఒమెగా త్రీ ఉండే కొవ్వులు ఈ హార్మోన్ల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బాదంపప్పులు, పల్లీలు, చేపలు, కొబ్బరి వంటివి ఆరోగ్యకరమైన కొవ్వులని అందిస్తాయి.

* ఆకుకూరలు, పసుపు, కొబ్బరి, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, బ్రకోలీ, చిలగడ దుంపలు, గుడ్లు వంటివీ హార్మోన్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్