Updated : 11/12/2022 04:47 IST

తాడాట.. ఆడేద్దామా?

తాడు అనగానే స్కిప్పింగ్‌ గుర్తొచ్చింది కదా! కానీ కాదు.. జిమ్‌లోనో.. ఆటగాళ్ల పరిచయ వీడియోల్లో రెండు చేతుల్లో రెండు తాళ్లు పట్టుకొని అలల్లా పైకీ, కిందకీ అంటుంటారు గమనించారా? దాన్ని బాటిల్‌ రోప్‌ అంటారు. ఈ వ్యాయామం మనకీ చాలా మంచిది.

* సులువుగా అనిపిస్తోంది కదా.. కానీ కొన్ని సెకన్లకే చెమటలు పట్టించేస్తుంది. శరీరమంతటికీ మంచి వ్యాయామం. కాబట్టి.. కొత్తగా ప్రారంభించే వాళ్లకీ ఇది చాలా అనువు అంటారు నిపుణులు. చేతులతో వేగంగా చేస్తుంటాం కదా.. కొద్దిసమయంలోనే ఎక్కువ కెలోరీలు కరిగేలా చేస్తుందట. వేగంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.

* దీనితో శరీర పైభాగం వేగంగా కదులుతుంది. గుండెకు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. పొట్ట దగ్గర పేరుకొన్న కొవ్వు త్వరగా తగ్గాలన్నా.. శరీరానికి తీరైన ఆకృతి కావాలన్నా దీన్ని ఎంచుకోవచ్చు.

* ఈ ఒక్కదానితో పూర్తి శరీరానికి వ్యాయామం అయిపోతుంది. భుజాలు, నడుము, చేతులు, కాళ్లను దృఢంగా చేస్తుంది. అయితే త్వరగా అలసిపోతాం. కొంత సమయం పెట్టుకొని అలసట వస్తున్నా పూర్తి చేయడానికి ప్రయత్నించేయండి. ఇదో అలవాటుగా మారితే మనసుపైనా సానుకూల ప్రభావం చూపెడుతుంది. దీన్ని మానసిక దృఢత్వానికి పరీక్షగా చెబుతారు శిక్షకులు. ఇక్కడ సరిగా పూర్తి చేయగలిగితే అదే తీరు ఇతర వాటిపై కొనసాగుతుందన్నమాట. అలా మానసిక ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని