హీటర్‌ వేస్తున్నారా...

శీతకాలం చలి వణికిస్తోంది. గదిలో వెచ్చదనానికి హీటర్‌ వినియోగిస్తే మాత్రం జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అప్పుడే వెచ్చగా రాత్రంతా నిద్రలోకి జారుకోవచ్చు. లేదంటే అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది.

Published : 19 Jan 2023 00:49 IST

శీతకాలం చలి వణికిస్తోంది. గదిలో వెచ్చదనానికి హీటర్‌ వినియోగిస్తే మాత్రం జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అప్పుడే వెచ్చగా రాత్రంతా నిద్రలోకి జారుకోవచ్చు. లేదంటే అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది.

* హీటర్‌ను మంచం, సోఫా వంటి ఫర్నిచర్‌కు కనీసం మూడడుగులు దూరంగా ఉంచాలి. వాల్‌పేపర్స్‌ వేసిన గదిలో  అయితే ఆ గోడకు ఇవి దూరంగా ఉండాలి. లేదంటే హీటర్‌ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి తేలికగా అంటుకొని మండే ప్రమాదం ఉంది.

* ఆయిల్‌ బేస్డ్‌ లేదా సెరామిక్‌, అలాగే బేస్‌బోర్డ్‌ లేదా సర్క్యులేషన్‌.. ఏ తరహా హీటర్‌నైనా గదిలో ఎవరూ లేనప్పుడు ఆఫ్‌ చేయాలి. ఎవరూ లేకుండా గదిలో హీటర్‌ ఆన్‌ చేసి ఉంచి, ఆ తర్వాత లోపలికి ప్రవేశించినప్పుడు ఊపిరాడకుండా ఇబ్బంది పడాల్సివస్తుంది. కొన్నిసార్లు గదిలో నిప్పు కూడా చెలరేగొచ్చు.

* ఎక్కువ సేపు వాడుతున్నప్పుడు డివైస్‌లో మరమ్మతు రావొచ్చు. ఇది గుర్తించకుండా ఆఫ్‌ చేసి ఆన్‌ చేస్తుంటే హీటర్‌ నుంచి మంటలొచ్చే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది.

* రాత్రంతా హీటర్‌ను వేసి ఉంచకూడదు. దీనివల్ల ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. వీటిని గుర్తించకపోతే ప్రాణాపాయమూ వాటిల్లే ప్రమాదం ఉంది. మధ్యలో తగ్గించాలి లేదా ఆఫ్‌ చేయాలి.

* హీటర్‌ సరిగ్గా పనిచేయడం లేదని తెలిస్తే గది కిటికీ తలుపులు తీసి ఉంచాలి. లేదంటే శ్వాస సంబంధిత సమస్యలెదురై ఊపిరందకపోవచ్చు. ఇది నిద్రలో ఉన్నప్పుడు జరిగితే ప్రాణానికే ప్రమాదం వాటిల్లుతుంది.

* నిద్రలేచి బయటకు వచ్చేటప్పుడు హీటర్‌ను ఆఫ్‌ చేయడం మరవకూడదు. చిన్నారులున్నప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. వారికి తగిన, సౌకర్యంగా అనిపించేలా ఉష్ణోగ్రతను  సరి చేయాలి. లేదంటే పిల్లలు త్వరగా అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్