ఇవి గుప్పెడుంటే చాలు..

ఖాళీ కడుపుతో ఆఫీసుకి పరుగులు.. ఒక్కోసారి ఊసుపోకా ఆకలనిపిస్తుంటుంది. హ్యాండ్‌ బ్యాగులో ఈ విత్తనాలుంచుకోండి. ఆకలి బాధుండదు. ఆరోగ్యానికి తోడు అందాన్నీ పరిరక్షిస్తాయివి.

Published : 28 Jan 2023 00:14 IST

ఖాళీ కడుపుతో ఆఫీసుకి పరుగులు.. ఒక్కోసారి ఊసుపోకా ఆకలనిపిస్తుంటుంది. హ్యాండ్‌ బ్యాగులో ఈ విత్తనాలుంచుకోండి. ఆకలి బాధుండదు. ఆరోగ్యానికి తోడు అందాన్నీ పరిరక్షిస్తాయివి.

* గుమ్మడి.. విటమిన్‌ కె, ఇనుము, సోడియం, కార్బోహైడ్రేట్లు, పీచు, ప్రొటీన్లు వీటిలో మెండుగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరకణాలను రక్షించి, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. పీచు జీర్ణశక్తిని మెరుగుపరిచి శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటికి పంపుతాయి. దీంతో అధికబరువూ దూరం. మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయులను సమన్వయం చేసి, మధుమేహాన్ని దరిచేరనీయదు. రక్తపోటును తగ్గించి హృద్రోగాలు రాకుండా చూస్తుంది. ఈ గింజల్లోని అమైనోయాసిడ్స్‌, జింక్‌, కాపర్‌, సెలీనియం మెదడుకు విశ్రాంతినిస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటివి ఎదురుకావు.

* పుచ్చ గింజలు.. మెగ్నీషియం, జింక్‌, ఐరన్‌, మంచి కొవ్వులు పుష్కలంగా ఉండే వీటిలో కెలోరీలు తక్కువ. దీంతో అధిక బరువు సమస్య ఉండదు. చర్మాన్ని మెరిపిస్తాయి. వీటిలోని ప్రొటీన్లు జుట్టు రాలడం, చివర్లు చిట్లడం వంటి సమస్యలను అరికట్టి, ఒత్తైన శిరోజాలను అందిస్తాయి. ఇంకా వ్యాధినిరోధక శక్తిని పెంచి అనారోగ్యాలను దూరంగా ఉంచుతాయి. విటమిన్‌ బి నరాల వ్యవస్థను సక్రమంగా జరిగేలా చేసి మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ గింజలు నెలసరిలో వచ్చే మూడ్‌ స్వింగ్స్‌నీ దూరం చేయడంతోపాటు జీవక్రియలు సక్రమంగా జరగడానికీ దోహదపడతాయి.

* సబ్జా.. యాంటీ ఆక్సిడెంట్స్‌, పీచు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, జింక్‌, బి1, బి3 విటమిన్లు ఎముకల బలహీనతను నిరోధిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతాయి. వీటిలోని కెలోరీలు తక్షణ శక్తిని అందిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్