టీ లాంటి పానీయాలు..

ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, గొంతుమంట వంటి సమస్యలే! టీ తాగుతున్నట్లే అనిపిస్తూనే.. ఔషధ గుణాలతో ఆరోగ్యాన్ని పరిరక్షించే కొన్ని టీలున్నాయి. అల్లం, నిమ్మ, తులసితో చేసే వాటి గురించి తెలుసుకుందాం. 

Published : 07 Feb 2023 00:25 IST

ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, గొంతుమంట వంటి సమస్యలే! టీ తాగుతున్నట్లే అనిపిస్తూనే.. ఔషధ గుణాలతో ఆరోగ్యాన్ని పరిరక్షించే కొన్ని టీలున్నాయి. అల్లం, నిమ్మ, తులసితో చేసే వాటి గురించి తెలుసుకుందాం. 

అల్లంతో.. కప్పు నీటిని వేడిచేసి చిన్న అల్లంముక్క తురుము, రెండు లవంగాలు, చిన్నదాల్చిన చెక్క ముక్క వేసి మరగనివ్వాలి. ఇందులో చిన్న నారింజ తొక్క కూడా వేసి మరో రెండు నిమిషాలు మరిగించి వడకట్టి ఒకటిన్నర చెంచా తేనె కలిపితే చాలు. రుచికరమైన పోషకవిలువలతో టీ సిద్ధమవుతుంది. 

అశ్వగంధతో.. కప్పు నీటిలో రెండు చెంచాల అశ్వగంధపొడి పదినిమిషాలు మరిగించి వడకట్టాలి. ఇందులో చెంచా తేనె కలిపి తీసుకుంటే చాలు.

తులసి ఆకులతో.. కప్పు నీటిని వేడెక్కనిచ్చి, గుప్పెడు తులసి ఆకులు వేసి మరో పది నిమిషాలు మరిగించి వడకట్టి చెంచా చొప్పున నిమ్మరసం, తేనె కలిపితే తులసి పానీయం సిద్ధమవుతుంది. తులసి ఆకుల్లోని ఔషధగుణాలు ఆరోగ్యాన్నీ పరిరక్షిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్