జామ ఆకులు తింటే..

పచ్చగా నవనవలాడే జామకాయల్ని ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఇవి ఆరోగ్యానికి ఉపయోగపడినట్టే... వాటి ఆకులతోనూ మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో చూద్దామా.

Published : 19 Feb 2023 00:17 IST

పచ్చగా నవనవలాడే జామకాయల్ని ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఇవి ఆరోగ్యానికి ఉపయోగపడినట్టే... వాటి ఆకులతోనూ మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో చూద్దామా.

* ముఖంపై మచ్చలు టీనేజర్లను బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు ఒక జామ ఆకు, రెండు తులసి ఆకుల్ని నూరి ముఖానికి రాసుకోండి. ఫలితముంటుంది.

* కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారే ప్రక్రియని జామ ఆకులు నియంత్రిస్తాయి. జామఆకులతో చేసిన టీని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటూ మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుతుంది.

* జుట్టు రాలుతోందా? అయితే, జామ ఆకుల ప్యాక్‌ వేసేయండి. గుప్పెడు ఆకుల్ని లీటర్‌ నీళ్లలో వేసి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత వాటిని వడకట్టి ఆ నీళ్లలో గోరింటాకు, మందారాకు ముద్దను కాసేపు నాననివ్వండి. దీన్ని తలకు ప్యాక్‌లా వేసి ఆరాక గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది.

* చిన్నపాటి గాయాలు వేధిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో జామఆకులని రుద్ది చూడండి. త్వరగా ఉపశమనం లభిస్తుంది. పంటినొప్పీ, చిగుళ్లలో వాపూ, పుచ్చుపళ్లు వంటి సమస్యలున్నవారు శుభ్రం చేసిన జామ ఆకులని నమలడం వల్ల ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్