ఉత్పత్తుల్లో కొకోవా బటర్‌

యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌ ఏ, ఈ పుష్కలంగా ఉండే కొకోవాబటర్‌ చర్మానికి సాగే గుణాన్నిస్తుంది.

Published : 24 Feb 2023 00:20 IST

యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌ ఏ, ఈ పుష్కలంగా ఉండే కొకోవాబటర్‌ చర్మానికి సాగే గుణాన్నిస్తుంది. సౌందర్యోత్పత్తులను తీసుకొనేటప్పుడు వాటిలో కొకోవా బటర్‌ ఉందా లేదా చెక్‌ చేస్తే, ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు అంటున్నారు నిపుణులు. 

ఇందులోని పాలీఫినాల్స్‌ వృద్ధాప్యఛాయలను దరికి చేరనీయవు. కొకోవాబటర్‌ ఉన్న మాయిశ్చరైజర్‌ను అప్లై చేస్తే ప్రసవం తర్వాత స్ట్రెచ్‌ మార్క్‌ల సమస్యకు దూరంగా ఉండొచ్చు. గర్భందాల్చి పొట్ట, తదితర ప్రాంతాల్లో చర్మం సాగి, ఆ తర్వాత సాధారణస్థితికి చేరినప్పుడు అక్కడి చర్మం ఎటువంటి మార్పులకు గురికాకుండా మచ్చలు రానీయకుండా కొకోవా బటర్‌ పరిరక్షిస్తుంది. ముఖానికి అప్లై చేసే సన్‌స్క్రీన్‌ లోషన్స్‌, క్రీంలు, లిప్‌బామ్స్‌వంటి ఉత్పత్తుల్లో కొకోవా బటర్‌ ఉండేలా ఎంపిక చేసుకోండి.  మృదుత్వంతోపాటు చర్మంపై ఏర్పడే మచ్చలు, గీతలను మటుమాయం చేసే ఔషధగుణాలు ఇందులో మెండుగా ఉంటాయి.

రక్షిస్తుంది.. కొకోవా బటర్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలం అలాగే ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్‌ చర్మాన్ని నిత్యం మెరిసేలా ఉంచగలవు. చర్మంలోకి ఇది త్వరగా ఇంకి కణాలను ఆరోగ్యంగా ఉండేలా పరిరక్షిస్తాయి. చర్మం పైపొరను ప్రభావితంచేసే రసాయనాలు, కాలుష్యం, దుమ్ము, ధూళి వంటివాటి నుంచి కొకోవాబటర్‌ రక్షిస్తుంది. చర్మాన్ని సూర్యరశ్మి కిరణాల నుంచి కాపాడి, వృద్ధాప్యఛాయలను దరికి రానీయదు. గీతలు, మచ్చలు, ముడతలు వంటివాటిని త్వరగా మటుమాయం చేస్తుంది. సహజమొక్కల సమ్మేళనాలైన ఫైటోకెమికల్స్‌ మెండుగా ఉండే కొకోవాబటర్‌ చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మకణాలను ఉత్తేజం చేసి మెరుపునందిస్తుంది. చర్మసంబంధిత అనారోగ్యాలను దూరంగా ఉంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్