ఇంట్లోనే.. వ్యాయామం

మనకుండే పనుల్లో సమయం దొరక్క వ్యాయామం చేసేందుకు జిమ్‌కి వెళ్లడానికి సంకోచిస్తాం. ప్రస్తుతం తీసుకుంటున్న రిఫైన్డ్‌ ఆహారపదార్థాలు కావచ్చు, వాతావరణం ప్రభావం కావచ్చు చిన్నవయసులోనే ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నాం.

Published : 26 Mar 2023 00:25 IST

మనకుండే పనుల్లో సమయం దొరక్క వ్యాయామం చేసేందుకు జిమ్‌కి వెళ్లడానికి సంకోచిస్తాం. ప్రస్తుతం తీసుకుంటున్న రిఫైన్డ్‌ ఆహారపదార్థాలు కావచ్చు, వాతావరణం ప్రభావం కావచ్చు చిన్నవయసులోనే ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నాం. ఇంటిల్లిపాది బాధ్యతలు చూసుకునే మనం వీటన్నింటినీ అధిగమించాలంటే ఇంట్లో అయినా సరే కొంత సమయం కేటాయించి వ్యాయామం తప్పనిసరిగా చేయాల్సిందేనంటున్నారు నిపుణులు..

* శరీరం పూర్తిగా సహకరిస్తేనే వ్యాయామం చేయాలని గుర్తుంచుకోండి. ధ్యానం తో మొదలుపెట్టి యోగా, బరువులు ఎత్తడం వంటివి చేయొచ్చు. ప్రారంభంలో మరీ ఎక్కువ సమయం కేటాయించి శరీరం అలిసిపోయేలా మాత్రం వ్యాయామం చేయకూడదు. రోజూ కొంత సమయం పెంచుకుంటూ పోవాలి.

* ప్లాంక్‌లు, పుషప్‌లు శరీరాన్ని ధృఢంగా ఉంచేందుకు బాగా తోడ్పడతాయి. క్రమంగా థైరాయిడ్‌ సమస్య అదుపులోకి వస్తుంది.

* యోగా, ధ్యానం చేయడం వల్ల శరీరాకృతి చక్కగా ఉంటుంది. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు తగ్గడమే కాక, నెలసరి సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి.

* వ్యాయామాలు చేయటం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. రోజూకొంత సమయం తేలికపాటి బరువులు ఎత్తడం వల్ల కండరాలు ధృఢంగా మారతాయి. వీలైతే వాకింగ్‌నూ ఎంచుకోండి. శరీరానికి అలసట కలిగించి హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. ఒత్తిడి కూడా దరిచేరదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్