కాపడం.. ఏది.. ఎప్పుడు?

దెబ్బ తగిలినా, తలనొప్పిగా ఉన్నా ఎక్కువగా మన నోటి నుంచి వచ్చే మాట ‘కాపడం పెట్టారా’ అనే! సందర్భాలను బట్టి, వేడి, చల్లవి ఎంచుకుంటుంటాం. ఆ విషయంలో పొరపాటు చేయట్లేదు కదా? నిపుణులేం అంటున్నారో చదివేయండి. పెద్ద గాయాలు.. నొప్పి లాగేస్తుందని వేడి కాపడం పెడుతుంటారు.

Published : 28 Mar 2023 00:20 IST

దెబ్బ తగిలినా, తలనొప్పిగా ఉన్నా ఎక్కువగా మన నోటి నుంచి వచ్చే మాట ‘కాపడం పెట్టారా’ అనే! సందర్భాలను బట్టి, వేడి, చల్లవి ఎంచుకుంటుంటాం. ఆ విషయంలో పొరపాటు చేయట్లేదు కదా? నిపుణులేం అంటున్నారో చదివేయండి.

పెద్ద గాయాలు.. నొప్పి లాగేస్తుందని వేడి కాపడం పెడుతుంటారు. కానీ.. ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీసే అవకాశాలే ఎక్కువ. ఇలాంటప్పుడు చల్లటి కాపడం మేలు. ఇది వాపుని తగ్గించడమే కాదు ఇన్‌ఫ్లమేషన్‌నీ దరి చేరనీయదు. గాయం మాని, ఎముకల్లో నొప్పిలా అనిపిస్తే అప్పుడు వేడి కాపడాన్ని ఆశ్రయించొచ్చు.

ఆర్థరైటిస్‌.. జాయింట్ల వద్ద నొప్పి, పట్టేసినట్లు అనిపించడం సాధారణమే. దీనికి టబ్‌లో గోరువెచ్చని నీటిని నింపి దానిలో కొద్దిసేపు ఉండటమో.. కాస్త ఎక్కువసేపు స్నానం చేస్తే ఉపశమనం దొరుకుతుంది. మరీ వేడి నీటితో కాపడం, స్నానం రెండూ మంచిది కాదు.

తలనొప్పి.. ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయాన్నే నిద్రలేవడం, విరామం లేకుండా పని చేయడం మనలో చాలావరకూ తలనొప్పికి కారణాలు. చల్లని నీటిలో ముంచిన వస్త్రాన్ని తలకు చుట్టండి. నుదురు, కళ్లను కప్పేలా ఉంచి చూడండి. పోటు వస్తున్నట్లుగా ఉండే తలనొప్పికి ఇది చక్కని పరిష్కారం. తలలో నరాలు లాగినట్లుగా, మెడ కూడా నొప్పి అనిపిస్తోంటే వేడి కాపడం ప్రయత్నించొచ్చు.

బెణికిందా.. పనిహడావుడిలో, నిద్రలో కండరాలు పట్టేయడం, బెణకడం లాంటివి జరగడం మనకు పరిచయమే. అలాంటప్పుడు వాపు కనిపిస్తే మొదట ఐస్‌తో కాపడం పెట్టండి. తగ్గింది అనిపించాక తిరిగి వేడి కాపడం పెడితే కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. అయితే మరీ శరీరం మీద భరించలేనంత వేడిని మాత్రం ఉపయోగించొద్దు. నొప్పి భరించలేనట్లుగా ఉంటే ఈ ఇంటి చిట్కా పక్కన పెట్టి వైద్యులను సంప్రదించడం మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్