అవీ అలసట సూచనలే!

ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ ఎక్కడలేని నిస్సత్తువ, అన్నింటిపై అనాసక్తి. అదే చెబితే.. చాలాసార్లు ‘నీ భ్రమ’ అని కొట్టిపడేస్తారు. కానీ.. నిజంగానే మీలో సమస్య ఉండుండొచ్చు అంటున్నారు నిపుణులు. అయితే అది శారీరకం కాదు మానసికం.

Published : 25 May 2023 00:10 IST

ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ ఎక్కడలేని నిస్సత్తువ, అన్నింటిపై అనాసక్తి. అదే చెబితే.. చాలాసార్లు ‘నీ భ్రమ’ అని కొట్టిపడేస్తారు. కానీ.. నిజంగానే మీలో సమస్య ఉండుండొచ్చు అంటున్నారు నిపుణులు. అయితే అది శారీరకం కాదు మానసికం. దాన్ని గుర్తించే.. చిహ్నాలివీ!

* తరచూ తలనొప్పా? అన్నిసార్లూ అనారోగ్యమే కారణం కాదు. కాబట్టి, ట్యాబ్లెట్‌ వేసుకొని ఊరుకోవద్దు. ఒత్తిడి పెరిగిపోయినా మెడ, తలంతా లాగినట్లు అవుతుందట. కొన్నిసార్లు డిప్రెషన్‌ గానూ పరిగణిస్తారు. చిన్నవాటికే తికమకకు గురవడం, మర్చిపోవడం, దేనిపైనా మనసు లగ్నం చేయకపోవడం వంటివీ మానసిక అలసటకు చిహ్నాలే!

* ఊపిరి ఆగుతున్నట్లు.. గుండె బరువు ఎక్కినట్లు అనిపించినా అన్ని సార్లూ శారీరక సమస్య కాదు. మెదడులో అడ్రినలిన్‌, కార్టిసాల్‌ హార్మోన్లు పెరిగినా ఛాతీనొప్పి, విపరీతమైన చెమటకు కారణమవుతాయి.

* ‘ఇల్లు.. ఆఫీసులోనూ కుర్చీలో కూర్చొని చేసే పనులేగా.. ఏదో బరువు పనులు చేసినట్లు ఒళ్లు నొప్పులేంటి’ అంటే నిజమే అని సరిపెట్టుకుంటున్నారా? మరి ఒళ్లంతా ఎవరో కొట్టినట్టు ఆ నొప్పి సంగతేంటి.. ఆలోచించారా! భావోద్వేగ ఒత్తిడి కూడా కీళ్లు, కండరాలతోపాటు కొన్ని సార్లు గుండెల్లోనూ పొడుస్తున్నట్లు నొప్పికి దారితీస్తుందట.

* సినిమా, సీరియల్‌ చూస్తూ కూడా కన్నీరు కార్చేస్తారు మన ఆడాళ్లు. విపరీతమైన కామెడీ, బాధకీ స్పందించలేకపోవడం.. కారణం లేకపోయినా ఏడవడం.. మానసిక అలసటకు చిహ్నమే. నిద్ర పట్టకపోవడం, ఆకలి మందగించడం, ఊపిరి భారమవడం, నేనెందుకూ పనికిరాను, నావల్ల ఏదీ కావడం లేదు లాంటి భావనలు కలుగుతున్నాయంటే మనసు విశ్రాంతి కోరుకుంటోందనడానికి చిహ్నాలే. ఇలా తరచూ జరుగుతోంటే ఒత్తిడి కారణాలను గమనించుకోండి. దాన్నుంచి బయటపడే మార్గాలనూ ఆలోచించుకోవాలి.. ముందు మానసిక స్థాయిని గ్రహించడానికి నిపుణుల దగ్గరకు వెళ్లండి. ఆపై వాళ్ల సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటే వీటి నుంచి బయటపడటం సులువే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్