ఇంతికి మెంతి...

ఆకుకూరలు తింటే మంచిదని వినే ఉంటాం. అందులో మెంతి కూరది ప్రత్యేక స్థానం. చలువ చేసే ఈ కూరలో పోషకాలూ ఎక్కువే అంటారు నిపుణులు.   

Published : 27 May 2023 00:03 IST

ఆకుకూరలు తింటే మంచిదని వినే ఉంటాం. అందులో మెంతి కూరది ప్రత్యేక స్థానం. చలువ చేసే ఈ కూరలో పోషకాలూ ఎక్కువే అంటారు నిపుణులు.   

* మెంతికూరలో ఫోలిక్‌ యాసిడ్‌, థయామిన్‌, విటమిన్‌ ఎ, బీ6, రైబోఫ్లెవిన్‌, నియాసిన్‌ వంటి కీలక పోషకాలు, ఐరన్‌, క్యాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. కాళ్ల నొప్పులు వంటివీ తగ్గుతాయి.

* లావుగా ఉన్నామని బాధపడే వారు మెంతికూరను తరచూ తినడం మేలు. ఇందులో ఉండే ఫైబర్‌ మంచి కొలెస్ట్రాల్‌ పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువును అదుపులో ఉంచుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది.

* నెలసరి సమయంలో మహిళలు పొత్తికడుపు, నడుం నొప్పితో ఇబ్బందిపడతారు. ఇలాంటివారు పీరియడ్స్‌ సమయంలో ఈ ఆకుకూరను తినడం వల్ల ఈ సమస్యని అధిగమించొచ్చు. అలానే బాలింతల్లో పాలూ సమృద్ధిగా పడతాయి.

* మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యల్లో రక్తహీనత ఒకటి. ఐరన్‌ మోతాదు ఎక్కువగా ఉండే ఈ ఆకుకూరను రోజూ తినడం వల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. రక్త ప్రసరణా మెరుగ్గా జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్