శరీరాన్నీ మెదడునూ సేదతీరుస్తుంది..

జబ్బు చేశాక మందులు వేసుకోవడం కంటే రాకుండానే జాగ్రత్తపడటం మేలు కదా! అందుకు యోగాను మించింది లేదు. పిల్లలు అనారోగ్యాల బారిన పడకుండా ఉల్లాసంతో, ఉత్సాహంగా ఉండాలంటే గుప్తపద్మాసనం వేయించండి.

Published : 03 Jun 2023 00:06 IST

జబ్బు చేశాక మందులు వేసుకోవడం కంటే రాకుండానే జాగ్రత్తపడటం మేలు కదా! అందుకు యోగాను మించింది లేదు. పిల్లలు అనారోగ్యాల బారిన పడకుండా ఉల్లాసంతో, ఉత్సాహంగా ఉండాలంటే గుప్తపద్మాసనం వేయించండి..

ఇలా చేయాలి.. ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. ఆ భంగిమలోనే నెమ్మదిగా బోర్లా పడుకుని రెండు చేతులూ ముందుకు చాచాలి. పొట్ట మీద ఒత్తిడి తగులుతుండగా.. నెమ్మదిగా చేతులను వెనక్కి తీసికెళ్లి నమస్కార ముద్రలో ఉంచాలి. ఇలా ఎంత సేపు ఉండగలిగితే అంతసేపు ఉండి తర్వాత రెండు అరచేతులనూ కింద ఉంచి, వాటిపై బరువు మోపుతూ మోకాళ్ల మీద పైకి లేవాలి. ముడిచి ఉన్న కాళ్లను నెమ్మదిగా తీసి మామూలుగా కూర్చుని సేదతీరాలి.జ్ఞ

ప్రయోజనాలు... గుప్తపద్మాసనం వల్ల పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. అనారోగ్యాలు దరి చేరవు. సహస్ర, ఆజ్ఞా, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాధిష్టాన, మూలాధార- ఇలా అన్ని చక్రాలూ ఉత్తేజితమౌతాయి. వెన్నెముక బలంగా తయారవుతుంది. శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. పొట్ట వద్ద కండరాలు బలోపేతం అవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. గుప్తపద్మాసనం ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ ప్రక్రియ సవ్యంగా ఉంటుంది. శరీరం, మెదడూ సేదతీరతాయి. ఉద్వేగాలను నియంత్రించు కోగలుగుతారు. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రక్తపోటు, మధు మేహం, నిద్రలేమి, థైరాయిడ్‌ సమస్యలను దూరంగా ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్