కళలతోనే చికిత్స

కళలు మానసిక సమస్యలకు మందులా పనిచేయడాన్ని ప్రత్యక్షంగా చూశారు ఐశ్వర్య. అందుకే అలాంటి చికిత్సతో ఎందరికో ఉపయోగపడాలనుకున్నారు. ‘‘అందుకే ఆర్ట్‌ థెరపీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాలో చేరాను. దీని ద్వారా ఆన్‌లైన్‌ థెరపీ నిర్వహిస్తాం.

Published : 12 Jun 2023 00:24 IST

కళలు కాలక్షేపానికే కాదు.. మనోల్లా సాన్ని ఇస్తాయి. అనారో గ్యాలను తరిమేస్తాయి, మన గురించి మనం తెలుసుకునేలానూ చేస్తాయంటారు ఆర్ట్‌ సైకోథెరపిస్టు, ఆర్టిస్టు, యోగా టీచర్‌ ఐశ్వర్యా దత్తాని. కళలతో చికిత్స ఎలా చేస్తారో చదవండి...

ళలు మానసిక సమస్యలకు మందులా పనిచేయడాన్ని ప్రత్యక్షంగా చూశారు ఐశ్వర్య. అందుకే అలాంటి చికిత్సతో ఎందరికో ఉపయోగపడాలనుకున్నారు. ‘‘అందుకే ఆర్ట్‌ థెరపీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాలో చేరాను. దీని ద్వారా ఆన్‌లైన్‌ థెరపీ నిర్వహిస్తాం. క్లయింట్లను వారానికోసారి కలుస్తాం. మీటింగ్‌ గంటసేపు ఉంటుంది. ఆ వారంలో తమ అనుభవాలను పంచుకుంటారు. తీవ్ర ఒత్తిడి, వేదనలతో కుంగిపోతున్న వాళ్ల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాను.

ఎలా నయం చేస్తారు... అందరి కొలమానం ఒకలా ఉండదు, అంతా ఒకదాంట్లో ఇమడరు. వేదన కూడా అంతే. భిన్న రకాలకు విభిన్న చికిత్సలు. ఆయా వ్యక్తుల మనో వేదనను గమనించి దానికి తగ్గట్టుగా చికిత్స అందిస్తాం. కళలకు సంబంధించి వివిధ రకాల సరంజామా, పద్ధతులను సూచిస్తాం. దేన్ని ఉపయోగించాలి, ఎలా చేయాలి అనేది వాళ్లిష్టానికే వదిలేస్తాం. వాళ్ల ప్రతిస్పందనలను బట్టి సూచనలు చేసినా వాళ్ల అభిప్రాయమే ముఖ్యం. ఇంకో సంగతేమంటే ఏదో ఒక కళను ఎంచుకోవాలనే నిర్బంధం కూడా లేదు. వాటి పట్ల ఆసక్తి లేకుంటే యోగాలో తర్ఫీదిస్తాను’’ అని వివరించారావిడ.

‘‘ఆర్ట్‌ థెరపీ ఎవరికైనా మేలుచేసేదే. అయితే తనను తాను పరిశీలించుకుంటూ, అంతరంగంలోకి అవలోకించుకుంటూ, సవాళ్లను ఎదిరించే తెగువ ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా క్లయింట్‌ను అంచనా వేస్తాం. ఏ సందర్భంలో, ఎలాంటి అనుభవం ఎదురైంది.. పరిస్థితి తీవ్రత.. పాటిస్తున్న విధానాలు, వేదన నుంచి సంరక్షణ.. ఇదీ చికిత్స పద్ధతి. నేను ఆర్ట్‌ థెరపీని బలంగా నమ్మినప్పటికీ నా వల్ల మేలు జరగాలే తప్ప ఇసుమంత ఇబ్బంది కలగకూడదనేది సంకల్పం. ఆ ఉద్దేశంతోనే అనుభవజ్ఞులైన సైకాలజిస్టుల నేతృత్వంలో చికిత్స నిర్వహిస్తాం’’ అంటారు ఐశ్వర్య

ఐశ్వర్యకు యూకేలోని హెల్త్‌ అండ్‌ కేర్‌ ప్రొఫెషన్స్‌ కౌన్సిల్‌లోనూ సభ్యత్వం ఉంది. లైంగిక హింసకు గురైనవారిని దాన్నుంచి బయట పడేసేందుకు కృషి చేస్తుందీ సంస్థ. ఈ చికిత్సలో మాటలతో ప్రమేయం లేదు. ఎలాంటి శబ్దాలూ లేకుండా తనను తాను అన్వేషించుకుంటూ తన ప్రతిబింబాన్ని గమనించేట్లు చేస్తారు.

ప్రశంసల వెల్లువ... ఐశ్వర్య ఓర్పూ నేర్పూ అద్భుతమంటూ ప్రశంసిస్తారు పేషెంట్లు. భావోద్వేగాలను పంచుకోవడానికి అవసరమైన స్వేచ్ఛను, సమయాన్ని ఇస్తుంది.. లాలనగా మాట్లాడుతుంది, ఓదార్పునందిస్తుంది.. సమస్యల నుంచి బయటకు రావడానికి సమర్థంగా కృషి చేస్తుంది.. మనసు పొరల్లోని విషయాలను చాకచక్యంగా రాబడుతుంది.. సమస్యలను పరిష్కరించడమే కాదు, దయగా ఉంటుంది.. నైపుణ్యంతో వ్యవహరిస్తుంది.. యాంగ్జయిటీ నుంచి బయటికొచ్చామంటే అది ఆమె ప్రతిభే.. చెప్పేవి ఓర్పుగా వింటుంది, ఆత్మవిశ్వాసం నింపుతుంది.. ఆత్మీయురాలిలా కలిసిపోతుంది.. అని చెబుతారు తన వల్ల సాంత్వన పొందిన వేలాది మంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్