మహిళలకూ ముప్పు ఎక్కువే!

మహిళలకూ మగవారికే గుండె జబ్బులు వస్తాయనుకుంటారు చాలామంది. కానీ, మహిళల్లోనూ ఈ ముప్పు ఎక్కువే అంటున్నాయి అధ్యయనాలు. ఇందుకు ప్రధానంగా జీవనశైలిలో మార్పు, ఆహారపుటలవాట్లే కారణమట.

Published : 22 Nov 2023 02:02 IST
మగవారికే గుండె జబ్బులు వస్తాయనుకుంటారు చాలామంది. కానీ, మహిళల్లోనూ ఈ ముప్పు ఎక్కువే అంటున్నాయి అధ్యయనాలు. ఇందుకు ప్రధానంగా జీవనశైలిలో మార్పు, ఆహారపుటలవాట్లే కారణమట.

మగవారికే గుండె జబ్బులు వస్తాయనుకుంటారు చాలామంది. కానీ, మహిళల్లోనూ ఈ ముప్పు ఎక్కువే అంటున్నాయి అధ్యయనాలు. ఇందుకు ప్రధానంగా జీవనశైలిలో మార్పు, ఆహారపుటలవాట్లే కారణమట. మరి ఈ ముప్పునుంచి తప్పించుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాల్సిందే అంటారు వైద్యులు.

  • టీనేజీలో మితిమీరి తినే అలవాట్లు, పూర్తిగా శారీరక శ్రమకు దూరంగా ఉండటం వంటివన్నీ ఊబకాయానికి కారణమవుతున్నాయి. క్రమంగా నెలసరులు దారి తప్పడం, పీసీఓడీ...ఇతరత్రా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. సమతులాహారాన్ని తీసుకోవడం మొదటి నుంచీ అలవాటు చేసుకోవాలి. ఆటలో, డ్యాన్సో, ఇంటిపనో...రోజూ కనీసం ఓ గంటైనా వ్యాయామం ఉండాలి. అప్పుడే ఈ ముప్పు బారిన పడకుండా ఉంటారు.
  • ఇటు ఇంటిపనీ, అటు ఆఫీసు విధులు... రెండింటినీ సమన్వయం చేసుకోలేక హడావుడి పడిపోతుంటారు కొందరు మహిళలు. ఈ పనుల ఒత్తిడితో ఉదయం అల్పాహారం తినకపోవడం, తిన్నా సరైన పోషకాలు లేకపోవడం జరుగుతుంది. దీంతో ఆ ఆకలి...మధ్యాహ్నం భోజనంపై ప్రభావం చూపించి కాస్త ఎక్కువగా లాగించేస్తారు. ఈ అలవాటు వల్ల ఒంట్లో కెలోరీలు పోగవుతాయి. అధికబరువు భారం హృదయంపై పడుతుంది.
  • మారిన పనివేళలూ, కుటుంబ బాధ్యతలతో తీరిగ్గా వండుకునే ఓపికలేక రెడీమేడ్‌గా ఉండే జంక్‌ఫుడ్‌, ప్యాకేజ్డ్‌ ఆహారం, ఇన్‌స్టంట్‌ వంటకాలపై ఆధారపడే వారిసంఖ్యా పెరుగుతోంది. ఇందులోని నిల్వకారకాలు, నూనెలు, ఇతరత్రా పదార్థాలు అధిక కొలెస్ట్రాల్‌కు కారణం అవుతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితికి దూరంగా ఉండాలంటే ఆకుకూరలూ, కాయగూరల మోతాదుని పెంచాలి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లతో పాటు నీటిశాతాన్నీ పెంచుతాయి. ఫలితంగా జీవక్రియలూ పెరుగుతాయి. అలానే తీసుకున్న ఆహారం సరైన దిశలో జీర్ణం కావడానికి అవసరమైన పీచు శరీరానికి అందేలా చూసుకోవాలి.
  • రోజులో కచ్చితంగా నలభై నిమిషాలు వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. ఇది  మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇప్పటికే మీరు వ్యాయామాలు చేస్తుంటే వాటిల్లో కచ్చితంగా కార్డియో కసరత్తులనూ జతచేసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్