సిగ్గు పడితే.. సమస్యే!

తరచూ వెళ్తోంటే ఇబ్బంది అనుకొని మనలో చాలామంది ఎక్కువగా నీళ్లు తాగరు. కొన్నిసార్లు వాష్‌రూమ్‌లు సరిగా ఉండకపోవడం.. నెలసరిలో అపరిశుభ్రత.. కారణాలేమైతేనేం.. మనల్ని తరచూ యూరిన్‌ ఇన్‌ఫెక్షన్లు పలకరిస్తుంటాయి.

Published : 26 Nov 2023 02:11 IST

తరచూ వెళ్తోంటే ఇబ్బంది అనుకొని మనలో చాలామంది ఎక్కువగా నీళ్లు తాగరు. కొన్నిసార్లు వాష్‌రూమ్‌లు సరిగా ఉండకపోవడం.. నెలసరిలో అపరిశుభ్రత.. కారణాలేమైతేనేం.. మనల్ని తరచూ యూరిన్‌ ఇన్‌ఫెక్షన్లు పలకరిస్తుంటాయి. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవాలా?

  • నీరు.. పదే పదే వాష్‌రూమ్‌కి వెళ్లడం బాగోదని సిగ్గుపడి కూర్చుంటే మనకే ఇబ్బంది. శరీరం డీహైడ్రేట్‌ అయ్యి నీరసించి పోతుంది. రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తప్పక తీసుకోవాలి. సమస్య కనిపిస్తే ఆలోచిస్తూ కూర్చోక ద్రవరూప పదార్థాలను ఎక్కువగా తీసుకోండి. మజ్జిగలో పంచదార కలిపి తాగితే వాటిలోని ప్రోబయాటిక్స్‌ హాని కలిగించే సూక్ష్మజీవులతో పోరాడతాయి.
  • వంటసోడా.. మన వంటగదిలో దొరికే ఇది మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్‌కు మంచి మందు. గ్లాసు వేడినీటిలో పావుచెంచా వంటసోడాను కలిపి ఉదయాన్నే తాగండి. ఇలా వారం రోజులు చేస్తే ఫలితం ఉంటుంది.
  • దానిమ్మ.. తరచూ మూత్రవిసర్జన చేయాలనిపించడం, దానికి మంట కూడా జత అయితే దానిమ్మ గింజలను తినండి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ సి సమస్యను అదుపులోకి తెస్తాయి. దానిమ్మ తొక్కను చిన్న చిన్న ముక్కలుగా కోసి కొద్దిగా నీరు కలిపి మిక్సీపట్టాలి. చెంచా చొప్పున ఈ రసాన్ని రోజుకు రెండుసార్లు తీసుకున్నా మంచిదే. యోనిగోడల మధ్య ఇన్‌ఫెక్షన్‌ తగ్గుముఖం పడుతుంది.
  • ఉలవలు.. క్యాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉలవలను తీసుకోండి. ఇవి మూత్రపిండాల నుంచి టాక్సిన్లను తొలగించి బ్యాక్టీరియాను బయటికి పంపుతాయి. ఉలవలను నూనె లేకుండా దోరగా వేయించి పొడి చేసుకోవాలి. చెంచా చొప్పున రోజూ నేరుగా తిన్నా, గ్లాసు నీటిలో కలిపి తాగినా మంచిదే. దీంతో క్యాల్షియం లోపాన్నీ తగ్గించవచ్చు.
  • మెంతులు.. కొన్నిసార్లు మూత్రం తెలియకుండా లీకవుతుంది. దీనికి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణం. ఇలాంటప్పుడు రెండు చెంచాల మెంతులను పొడి చేసి, గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి, దానికి చిన్న అల్లం ముక్క తురుము, చెంచా తేనెను కలిపి రోజుకి రెండుసార్లు తీసుకొని చూడండి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు బ్యాక్టీరియాను నివారించడంలో సాయపడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్