పదే పదే వేడిచేస్తున్నారా..

కూరలు, పప్పులు వంటివి మిగిలితే.. ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. కావాల్సినప్పుడు బయటకు తీసి వేడిచేస్తుంటాం. ఇలా చేయటం వల్ల ఆహారం వృథా కాకుండా చేశాం అనుకుంటాం.

Published : 07 Dec 2023 01:29 IST

కూరలు, పప్పులు వంటివి మిగిలితే.. ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. కావాల్సినప్పుడు బయటకు తీసి వేడిచేస్తుంటాం. ఇలా చేయటం వల్ల ఆహారం వృథా కాకుండా చేశాం అనుకుంటాం. కానీ అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్టే అని తెలుసా?..

  • మాంసాహారం, పప్పు, గుడ్లు వంటివన్నీ మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పదార్థాలు. వీటిని మళ్లీమళ్లీ వేడిచేస్తే వాటిల్లోని మాంసకృత్తులు విచ్ఛిన్నమై.. ఆమ్లాలు ఉత్పత్తవుతాయి. తిన్న ఆహారం జీర్ణం కాకుండా చేస్తాయి. వీటిని తాజాగానే తినేయాలి. నిల్వ చేయకూడదు.
  • ఆహారాన్ని తిరిగి వేడిచేయటం వల్ల అందులోని విటమిన్‌ సి, బి వంటి పోషకాలు నశిస్తాయి. ఆ ఆహారం తిన్నా శరీరానికి ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.
  • అన్నం, పాస్తా వంటివాటిని కావాల్సినంతే వండుకోవాలి. మిగిలినదాన్ని ఫ్రిజ్‌లో పెట్టి వేడిచేసి తినడం అంటే హానికర బ్యాక్టీరియాని స్వయంగా శరీరంలోకి ఆహ్వానించడమే. 
  • బంగాళాదుంప లేదా బ్రెడ్‌ వంటి పిండిపదార్థాలను మరలా వేడిచేయటం వల్ల క్యాన్సర్‌ కారకాలు ఉత్పన్నమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే తాజాగా ఉన్నప్పుడే తినేయాలి. ఎక్కువ వండటం, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం కన్నా.. కావాల్సినంతే వండుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్