గోళ్లు పదిలమేనా?

చర్మ ఆరోగ్యానికి ఎన్నో జాగ్రత్తలు పాటిస్తాం. మరి గోళ్ల మాటేంటి? అవి ఆరోగ్యంగా ఉంటేనే అందం పరిపూర్ణమైనట్టు. కాబట్టి, వాటినీ పట్టించుకోండి.

Updated : 09 Feb 2024 02:12 IST

చర్మ ఆరోగ్యానికి ఎన్నో జాగ్రత్తలు పాటిస్తాం. మరి గోళ్ల మాటేంటి? అవి ఆరోగ్యంగా ఉంటేనే అందం పరిపూర్ణమైనట్టు. కాబట్టి, వాటినీ పట్టించుకోండి.

  • పదే పదే విరగడం, పొట్టులా లేచిపోవడం జరుగుతోంటే వాటికీ శ్రద్ధ కావాలని అర్థం. పోషకాలు సరిగా అందకపోయినా, రసాయనాలతో కూడిన నెయిల్‌ పాలిష్‌ వగైరా వాడుతున్నా ఇలా జరుగుతుంది.
  • పూజలు, వంట సమయాల్లో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అప్పుడు గోళ్లు పసుపు వర్ణంలోకి మారడం మామూలే. అలాంటివేమీ లేకపోయినా రంగు మారుతోంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు అయ్యుండొచ్చు.
  • గోరు మధ్యలో విరగడం, చర్మంలోకి చొచ్చుకొని పోతున్నట్లుగా పెరగడం, పొడిబారి కళావిహీనంగా మారడం, ఎర్రబడటం, నొప్పి వంటివన్నీ గోళ్లకు సరైన పోషణ అందడం లేదన్న దానికి చిహ్నాలే. అవి కనిపించినప్పుడు...
  • ముఖానికిలాగే వీటికీ తేమ కావాలి. కాబట్టి, రోజూ రాత్రి కొబ్బరి, బాదం, ఆలివ్‌ నూనెల్లో నచ్చినదాన్ని గోళ్లకు పట్టించి, మృదువుగా రుద్దితే సరి. ఇంటి పనులన్నీ నీటితో ముడిపడినవే. శుభ్రత కోసం వినియోగించే సబ్బులు, డిటర్జెంట్లు వీటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి, శుభ్రత సమయంలో గ్లవుజులు వాడటం మేలు.
  • ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించుకోండి. మురికి వగైరా చేరదు. ఇంకా గోళ్ల రంగులు, నెయిల్‌ పాలిష్‌ రిమూవర్లను నాణ్యమైనవే ఎంచుకోవాలి. డబ్బాల మూతలు తీయడానికీ, స్టిక్కర్లు వగైరా తొలగించడానికీ గోళ్లనే ఉపయోగిస్తుంటాం కదా! అదీ మానుకోవాలి. వాటిపై భారం పడటమే కాదు, ఆ పదార్థాల తాలూకూ చిహ్నాలు గోళ్లలోకి చేరి అలర్జీలకు కారణమవుతుంటాయి. వీటితోపాటు విటమిన్లు, మినరల్స్‌తో కూడిన పోషకాహారానికీ చోటిస్తే అందమైన, ఆరోగ్యమైన గోళ్లు మీ సొంతం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్