ఇవే దానికి సంకేతాలా?

అమ్మాయిల మీద హార్మోనుల ప్రభావం ఎక్కువే. ప్రతి దశలోనూ వాటి పాత్ర కీలకం. చిన్న వయసులోనే నెలసరి మొదలవటం, గర్భధారణ సమయంలో మరీ ఎక్కువగా బరువు పెరగటం, షుగర్‌ స్థాయులు పెరగటం, పీసీఓడీ, నెలసరి క్రమం తప్పటం, మెనోపాజ్‌...ఈ సమస్యలను చాలామందిలో చూస్తుంటాం.

Published : 09 Feb 2024 01:25 IST

అమ్మాయిల మీద హార్మోనుల ప్రభావం ఎక్కువే. ప్రతి దశలోనూ వాటి పాత్ర కీలకం. చిన్న వయసులోనే నెలసరి మొదలవటం, గర్భధారణ సమయంలో మరీ ఎక్కువగా బరువు పెరగటం, షుగర్‌ స్థాయులు పెరగటం, పీసీఓడీ, నెలసరి క్రమం తప్పటం, మెనోపాజ్‌...ఈ సమస్యలను చాలామందిలో చూస్తుంటాం. అయితే అప్పటికి చికిత్స తీసుకుని హమ్మయ్య...తగ్గిందిలే అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ అసలు అవి ఎందుకు వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించారా! మన శరీరంలో జీవక్రియా లోపానికి అవి సంకేతమని తెలుసా! వీటిని నిర్లక్ష్యం చేస్తే టైప్‌ 2 డయాబెటిస్‌, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్‌ పిల్‌గ్రిమ్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేసిన పరిశోధనలో వెల్లడైంది. అందుకు కారణం హార్మోనుల అసమతుల్యత, అధిక కొవ్వు, జన్యులోపాలు వంటివి అయిఉండొచ్చని పరిశోధకుల అంచనా. అందుకే ఈ సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు పరీక్ష చేయించుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించగలిగితే ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండగలం. ఆరోగ్యంగా జీవించగలం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్