వెరికోజ్‌ వెయిన్స్‌ నివారణకి అర్ధ హలాసనం

ఉద్యోగుల్లో ఎక్కువ శాతం కూర్చునే ఉంటారు. దాంతో బరువు పెరగడంతో పాటు శరీరంలోని కండరాలు, నరాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీంతో రక్తప్రసరణ సరిగ్గా జరగదు. తర్వాత రక్తం గడ్డలు కట్టి వెరికోజ్‌ వెయిన్స్‌కి దారితీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య గర్భధారణ, మెనోపాజ్‌ సమయంలో హార్మోన్లలో మార్పుల కారణంగా ఏర్పడుతుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ‘అర్ధ హలాసన’ ప్రయత్నించండి.

Published : 10 Feb 2024 02:05 IST

ముందుగా శవాసనం వేయాలి. నెమ్మదిగా రెండు కాళ్లను దగ్గరకు తీసుకురావాలి. రెండు అరచేతులను నేలపై సమాంతరంగా బోర్లించి ఉంచాలి. ఇప్పుడు రెండు కాళ్లను 90 డిగ్రీల కోణం వచ్చేలా నిటారుగా ఫొటోలో చూపిన మాదిరిగా ఉంచాలి. ఈ క్రమంలో శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇలా 40 సెకన్ల నుంచి సమయాన్ని పెంచుకోవచ్చు. తర్వాత నెమ్మదిగా యథాస్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా రోజుకి 3 నుంచి 5 సెట్ల్లు చేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి, కాళ్లవాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తొడ, తుంటి, ఉదర కండరాలను బలపరుస్తుంది. దీంతోపాటు తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలను ఎక్కువగా తినాలి. వీటితో పాటు కూర్చునే, నిద్రించే సమయంలో కాళ్లను ఎత్తులో ఉంచాలి. బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. మేజోళ్లు ధరించాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

యోగ గురు, శిరీష

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్